ఎప్పుడూ మగాళ్లు మాత్రమే ముందుంటారు అనే అపోహను కొట్టి పారేస్తూ వ్యాపార రంగంలో అంచలంచెలుగా ఎదిగి పొరుగు దేశంలో కూడా తన సత్తా చాటిన మహిళ ఇంద్రా నూయి(indra nooyi). అలాంటి ప్రతిభ,తెలివి కలిగిన ఇంద్రా నూయి గురించి తెలుసుకోవాలి అంటే ఇది చదవాల్సిందే.
1955, అక్టోబర్ 28న తమిళనాడులోని చెన్నైలో జన్మించిన ఇంద్రా నూయి అక్కడున్న హోలీ ఎంజెల్సు ఆంగ్లో ఇండియను హైయర్ సెకండరీ పాఠశాలలో తన ఉన్నత విద్యను పూర్తి చేశారు.
ఆ తరువాత 1974లో మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో చదువుతూ భౌతికరసాయనశాస్త్రాలలో డిగ్రీ పొందిన ఆమె 1976లో కలకత్తాలోని ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ మేనెజిమెంట్ కాలేజి నందు ఎమ్.బి.ఏ పూర్తి చేశారు.
పై చదువుల కోసం అమెరికాకు వెళ్లి 1980లో యేల్ యూనివర్సిటీలో తన చదువు ముగించిన ఇంద్రా నూయి మోటరోలా, ఆసియ బ్రౌన్ బొవెరీ లాంటి పెద్ద సంస్థలలో కీలకమైన పదవులలో బాధ్యతలు నిర్వహించారు.
తను అడుగు పెట్టిన ప్రతి చోట అంచలంచెలుగా ఎదుగుతూ దూసుకుపోయిన ఆమె 1980లో తన 25 ఏళ్ల వయసులో తను మెచ్చిన,తనకు నచ్చిన రాజ్ కే నూయిను వివాహమాడి, తమ ప్రేమకు గాను జన్మించిన వారి కూతుర్లు ప్రీతా మరియు తార నూయిలతో సంతోషమైన జీవితాన్ని జీవిస్తున్నారు.
ప్రతి తరుణంలో అందర్నీ ఆశ్చర్య పరుస్తూ తన పదవులలో సాగిపోతున్న ఇంద్రా నూయి ప్రతి అమ్మాయి జీవితం పెళ్లి తరువాత ఆగిపోతుంది అన్న మాటలను అపోహలు మాత్రమేనని నిరూపించారు.
1994లో పెప్సీకోలో చేరిన ఇంద్రా నూయి తన ప్రతిభను చూపుతూ అనతి కాలంలోనే అందర్నీ ఆశ్చర్య పరుస్తూ 2001లో ప్రధాన ఆర్థిక నిర్వహణాధికారి (CFO) పదవికి ఎదిగింది.
1998లో పెప్సీకో ట్రాపికానాను సొంతం చేసుకోవడంలో ముఖ్య పాత్ర పోషించింది.
ఇంద్రా నూయి పెప్సీకో కంపెనీ CEO (2006–18) మరియు బోర్డు చైర్మన్ (2007–19)గా పనిచేశారు.
ఫార్చూన్ పత్రిక ఇంద్రా నూయి ప్రతిభకు,తెలివి తేటలను మెచ్చి 2006-2010 సంవత్సరాలలో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తగా పేర్కొనగా, ఫోర్బ్స్ పత్రిక ఆమెను అత్యంత శక్తివంతమైన వందమంది మహిళల జాబితాలో ఒకరిగా చేర్చి ప్రశంసల వర్షం కురిపించింది.
అలా ప్రతి తరుణంలో అందర్నీ ఆశ్చర్య పరుస్తూ మహిళలలైనంత మాత్రాన ఎవరికీ లొంగి బ్రతకాల్సిన అవసరం లేదని భారత దేశం నుంచి వెళ్లిన ఒక అమ్మాయిగా చాటి చెప్పింది.
ఏదేమైన అలాంటి ప్రతిభ,తెలివి కలిగిన ఇంద్రా నూయి గురించి తెలుసుకుని, నలుగురికి తెలిసేయచేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది.
also read news:
Bihar Bridge Collapse : ప్రారంభానికి ముందే కుప్పకూలింది.. బిహార్‌లో బ్రిడ్జి పనుల్లో డొల్లతనం
Moral Stories in Telugu : దురాశ దుఃఖానికి చేటు