HomecinemaPawan Kalyan :బాల‌య్య ప్ర‌శ్న‌కు అదిరిపోయే స‌మాధానం ఇచ్చిన ప‌వ‌న్ .. ఫ్యాన్స్ ఫుల్ ఫిదా..!

Pawan Kalyan :బాల‌య్య ప్ర‌శ్న‌కు అదిరిపోయే స‌మాధానం ఇచ్చిన ప‌వ‌న్ .. ఫ్యాన్స్ ఫుల్ ఫిదా..!

Telugu Flash News

Pawan Kalyan : మాస్ కా బాప్ నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా రూపొందుతున్న షో అన్‌స్టాప‌బుల్‌.. ఈ కార్య‌క్ర‌మం మొద‌టి సీజ‌న్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో ఇప్పుడు రెండో సీజ‌న్ కూడా అదే జోష్‌తో దూసుకుపోతుంది. ప్ర‌భాస్ ఎపిసోడ్ న్యూ ఇయ‌ర్ కానుక‌గా టెలికాస్ట్ కాగా, ఇప్పుడు సంక్రాంతి కానుక‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంద‌ని అంటున్నారు. పవన్‌ తో ఇప్పటికే బాలయ్య అన్‌ స్టాపబుల్‌ షో షూటింగ్‌ ముగిసింది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య ఏమి అడిగి ఉంటారు…పవన్ ఏమి సమాధానులు ఇచ్చి ఉంటారనే విషయమై సోషల్ మీడియాలో అనేక‌ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఈ ఎపిసోడ్ నుంచి చిన్న‌ లీక్ అయ్యింది.

అన్నయ్య దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు అని ప‌వ‌న్ ని.. బాలయ్య ప్రశ్నించారు.. అందుకు పవన్ కళ్యాణ్ ఒక్క సెకను కూడా ఆలోచించకుండా సమాధానం ఇచ్చారు. అది ఆయన మనస్సులోంచి వచ్చింది. అదేమిటంటే… కష్టపడే స్వభావం నేర్చుకున్నా….ఈ సమాధానం విన్నాక..పవన్ కళ్యాణ్ పై అప్పటిదాకా ఉన్న గౌరవం అభిమానుల‌లో మ‌రింత‌ రెట్టింపు అయింది. ఓప్రక్కన సినిమాలు, సమాజ సేవ, రాజకీయాలు అన్ని ఒంటి చేత్తో లాక్కు రావటం అంటే మాటలు కాదు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ఎవరూ కొట్టలేరనేది వాస్త‌వం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బాలయ్యతో కలిసి ఈ షోలో సందడి చేయనున్నారని ఎప్పటినుంచో టాక్ వినిపించ‌గా, అది ఎట్ట‌కేల‌కి నిజం అయింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కాగా, సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ కాబోతుందని ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన లేదు. ఈ ఎపిసోడ్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనీవినీ ఎరుగని రీతిలో అందరికి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో పవన్‌తో కలిసి డైరెక్టర్ క్రిష్ హాజరు అయిన్నట్లు స‌మాచారం.. త్రివిక్రమ్ వచ్చారా లేదా ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొన్ని ప్రముఖ థియేటర్స్ లో ఈ ఎపిసోడ్ ని ప్రదర్శించడానికి చూస్తున్నారని టాక్.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News