పాకిస్తాన్‌లో సంక్షోభం (Pakistan Crisis) ముదురుతోంది. రోజురోజుకూ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఆహార సంక్షోభానికి తోడు ఇప్పుడు ఆర్థిక సంక్షోభం కూడా మొదలైంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ రూపాయి మారకం విలువ పడిపోయింది. మునుపెన్నడూలేని స్థితిని చవిచూస్తోంది. గురువారం డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి రూ.255కు పడిపోయిందని అక్కడి మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. ఇది రికార్డు స్థాయి కనిష్టమని వార్తలు వచ్చాయి.
బుధవారం కరెన్సీ విలువ రూ.230.89గా ఉండగా ఒక్కరోజులోనే రూ.24 రూపాయలు పడిపోయింది. సంక్షోభం నుంచి గట్టెక్కడానికి పాక్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. కరెన్సీ మారకం రేటు నిబంధనలు సడలించడంతో ఒక్కసారిగా విలువ భారీగా పడిపోయింది. రూపాయి విలువను మార్కెట్ నిర్ణయించేలా చూడాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి పాకిస్తాన్‌కు సూచించింది. దీంతో ఐఎంఎఫ్ వద్ద ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 6.5 బిలియన్ డాలర్ల నిధుల విడుదలకు ఆమోదం లభిస్తుందనే ఆశతో పాక్ ఈ నిబంధనలకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి 2019లోనే ఐఎంఎఫ్ ఈ సాయం అందించేందుకు ఒప్పుకుంది. అయితే, సాయం విషయంలో కొన్ని షరతులు పెట్టింది. పాక్ రూపాయి విలువ మార్కెట్ ఆధారంగా నిర్ణయం జరగాలని, లెటర్ ఆఫ్ క్రెడిట్లపై నిషేధం ఎత్తివేయాలని స్పష్టం చేసింది.ఇంకా పలు కండీషన్లు పెట్టడంతో పాకిస్తాన్ వీటికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే సాయం ఆగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా సాయం అత్యవసరం అయ్యింది. దీంతో షరతులకు ఒప్పుకోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.
పొదుపు మంత్రం పఠిస్తున్న పాక్..
మరోవైపు ఆహారం, విద్యుత్ కొరత కారణంగా ప్రజలు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆహార ధాన్యాలు అడుగంటిపోవడంతో ఉన్న వాటి విలువ భారీగా పెరిగిపోయింది. ఇప్పటికే ప్రజలు ఆహార ధాన్యాలు, ఫుడ్ వెంట పరుగులు, ఛేజింగ్‌లు చేస్తున్న వీడియోలు కూడా నెట్టింట్ వైరల్ అయ్యాయి. పాక్‌లో విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం వల్ల ఇంధన కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పొదుపు చర్యలు పాటించడం తప్ప గత్యంతరం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంటోంది.
also read :
KCR Visit to Nanded : నాందేడ్‌లో బీఆర్‌ఎస్ సభకు సర్వం సిద్ధం.. కేసీఆర్ పర్యటన వివరాలివీ..
Breaking news : లోకేష్ పాదయాత్ర లో తారక రత్న కు కార్డియాక్ అరెస్ట్.. కొనసాగుతున్న అత్యవసర చికిత్స
Lokesh Padayatra: నేటి నుంచే యువగళం పాదయాత్ర.. సుదీర్ఘ ప్రయాణానికి నారా లోకేష్ తొలి అడుగు