Oppo F23 5G: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో సరికొత్త ఫోన్‌తో మార్కెట్లోకి వచ్చింది. చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన ఒప్పో.. Oppo F23 5G పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో ఇది అందుబాటులోకి వచ్చింది.
బడ్జెట్ ధరలో అద్భుతమైన కెమెరా పని తీరుతో ఒప్పో ఎఫ్23 5జీ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ రూపొందించింది. ఒప్పో ఎఫ్ సిరీస్ ఫోన్లలో ప్రత్యేకంగా కెమెరా క్వాలిటీకి ఈ సంస్థ ఇంపార్టెన్స్ ఇస్తోంది. తాజా స్మార్ట్ ఫోన్ లోనూ కెమెరా విషయంలో స్పెషాలిటీ చూపింది.
Oppo F23 5G చూడ్డానికి ప్రీమియం రెనో 8 సిరీస్ లాగే కనిపిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ రెండు కలర్ష్‌లో రిలీజ్ చేసింది. ఒకటి బోల్డ్ గోల్డ్ కలర్ కాగా, మరొకటి కూల్ బ్లాక్ కలర్స్. మే 18 నుంచి Oppo F23 5G సేల్ ప్రారంభం కానుంది.
ఈ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్, 25 6జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ వేరియంట్‌లోనే అవైలబుల్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ రూ. 24,999గా నిర్ణయించింది. Oppo F23 5G స్మార్ట్ ఫోన్ మీడియం రేంజ్ బడ్జెట్ వినియోగదారులను అట్రాక్ట్ చేస్తోంది.
స్లిమ్ బాడీ, ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్, 6.7 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 695 ఎస్ఓసీ చిప్ సెట్, 67డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం దీని సొంతం.
Read Also : Success Story: 22 ఏళ్ల యువకుడు.. కోచింగ్ లేకుండా ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఐపీఎస్ కొట్టాడు!