HomecinemaNTR: జూనియర్ ఎన్టీఆర్‌ని క‌లిసిన టీమిండియా క్రికెట‌ర్స్.. పిక్ అదిరిపోలా..!

NTR: జూనియర్ ఎన్టీఆర్‌ని క‌లిసిన టీమిండియా క్రికెట‌ర్స్.. పిక్ అదిరిపోలా..!

Telugu Flash News

NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వైవిధ్య‌మైన సినిమాలు చేసుకుంటూ వ‌స్తున్న ఎన్టీఆర్ ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో మ‌నం చూశాం. అంతేకాదు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందాడు. అయితే ఎన్టీఆర్‌కి దేశ విదేశాల‌లో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌గా, క్రికెట‌ర్స్ సైతం ఆయ‌న‌ని ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే తెలుగు నటీనటులతో మాత్రం క్రికెటర్లకు పరిచయాలు తక్కువే. కానీ ఎన్టీఆర్, భారత క్రికెటర్లతో దిగిన ఫొటో చూస్తుంటే అభిమానుల‌కి తెగ ముచ్చటేస్తుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

న్యూజిలాండ్ తో జనవరి 18న టీమిండియా తొలి వన్డే ఆడనుంది. హైదరాబాద్ లో ఈ మ్యాచ్ జరగనుండ‌గా, ఇందులో భాగంగా ఇక్కడికి వచ్చేసిన క్రికెటర్లు.. ‘ఆర్ఆర్ఆర్’ ఫేమ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ని కలిశారు. అయితే అనుకోకుండా కలిశారా? లేదా పార్టీ చేసుకోవడం కోసం కలిశారా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏదైనా సరే ఫొటో మాత్రం చూడటానికి చాలా బాగుంది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియా వరకు తారక్ రేంజ్ పెరిగిపోయిందని, అస్సలు తగ్గేదే లే అని అభిమానులు, పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే.. జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గతేడాది ముందు వరకు కేవ‌లం సౌత్ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తర్వాత మాత్రం తారక్ పేరు దేశ‌మంతా మార్మోగిపోయింది. వరల్డ్ వైడ్ పాపులర్ అయిపోయాడు. హాలీవుడ్ సెలబ్రిటీల దగ్గర నుంచి మన సినీ సెలబ్రిటీల వరకు ఇప్పటికీ మెచ్చుకుంటూనే ఉన్నారు. ఆస్కార్స్ లిస్ట్‌లోను త‌న పేరు నిలిచింది. రోజురోజుకి తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్న ఎన్టీఆర్ బాగా ఫేమస్ అయిపోయాడు. అందులో భాగంగానే టీమిండియా క్రికెట‌ర్స్‌… తార‌క్‌ని క‌లిసార‌ని స‌మాచారం.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News