Telugu Flash News

NTR: బాల‌య్య‌ని ప‌క్క‌న పెట్టి ఎన్టీఆర్‌కి ప్ర‌త్యేక గౌర‌వం ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం

jr ntr

NTR: నంద‌మూరి హీరోల‌లో సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌ర్వాత ఆ రేంజ్‌లో మంచి పేరు తెచ్చుకుంది బాల‌య్య‌. త‌న కెరీర్‌లో ఎన్నో ర‌కాల పాత్ర‌లు పోషించి అల‌రించాడు. ఇప్పుడు రాజ‌కీయాల‌లోను రాణిస్తున్నాడు. ఇక బాల‌య్య త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

ఇప్పుడు అత‌నికి తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక గౌర‌వం అందించింది. ఖ‌మ్మంలోని లకారం ట్యాంక్ బండ్ పై మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండ‌గా, దాదాపు 54 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరణకు ఎప్పటినుంచో సన్నాహాలు చేస్తూ వ‌స్తున్నారు.

అయితే ఎన్టీఆర్ శతజయతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా మే 28న ఈ విగ్రహా ఆవిష్కరణ చేయనున్నారు. తాజాగా తారక్‏ను కలిసిన‌ మంత్రి పువ్వాడ… విగ్రహ ఆవిష్కరణ ప్రారంభ ఏర్పాట్లపై ఎన్టీఆర్ తో చర్చించి ఫొటోల‌కి పోజులు కూడా ఇచ్చారు.

బాల‌య్య‌ని కాద‌ని ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా ఆహ్వానించారంటే, తెలంగాణ ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ కి ఇస్తున్న విలువ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అని ప‌లువురు విశ్లేష‌కులు చ‌ర్చ‌లు సాగిస్తున్నారు.

also read :

Rajinikanth : రజనీకాంత్‌పై వైసీపీ అటాక్.. చంద్రబాబును పొగడటంపై నేతల కౌంటర్లు!

Exit mobile version