మెగా ప్రొడ్యూసర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే . ఇద్దరి అంగీకారంతో నెల రోజుల కిందటే హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరిద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.
కొన్నేళ్ల క్రితం నిహారిక భర్త చైతన్య తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో జనాలకు అనుమానం వచ్చింది. అప్పటి నుంచి నిహారిక విడాకుల విషయమై అనేక ప్రచారాలు జరుగుతున్నా ఎవరూ స్పందించలేదు. ఇటీవల డెడ్ పిక్సెల్స్ ప్రమోషన్స్‌లో అడిగినప్పుడు నిహారిక స్పందించలేదు. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ నిశ్చితార్థంలో నిహారిక సోలోగా కనిపించిన తర్వాత, ఆమె విడాకులు నిజమేనని అందరూ నిర్ణయించుకున్నారు.
అయితే, కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక, చైతన్య విడాకుల కొరకు దరఖాస్తు చేసుకున్నట్లు విషయం బయటకు రావడంతో నిహారిక స్పందించాల్సి వచ్చింది. నెల రోజుల క్రితమే వారిద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసిందని, విడాకుల పిటిషన్ వెలుగులోకి రావడంతో ఎట్టకేలకు నిహారిక తన సోషల్ మీడియా ద్వారా విడాకులపై తొలిసారిగా స్పందించింది. పరస్పర అంగీకారంతోనే తాను, చైతన్య విడాకులు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.
అయితే తమ విడాకుల విషయంపై చాలా మంది నుంచి వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై నిహారిక అధికారికంగా స్పందించింది. ‘పరస్పర అంగీకారంతో మేమిద్దరం విడాకుల నిర్ణయం తీసుకున్నాం. ఇది చాలా సున్నితమైన విషయం. మా వ్యక్తిగత జీవితంలో మా ఇద్దరికీ ప్రైవసీ కావాలి. ఈ కష్ట సమయంలో నా కుటుంబం, స్నేహితులు నాకు అండగా నిలిచారు. అందరినీ కోరుతున్నాను.. మాపై నెగిటివ్ ప్రచారం చేయవద్దు. ఇలాంటి సమయంలో ఇబ్బంది పెట్టకండి. ఇది ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయం. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.’ ఆమె చెప్పింది. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు నిహారిక కృతజ్ఞతలు తెలిపింది.
View this post on Instagram
పెళ్లి తర్వాత నిహారిక సినిమాలకు స్వస్తి చెప్పి నిర్మాణంపైనే దృష్టి సారించింది. అయితే ఎప్పుడైతే తన భర్తకు దూరమైందో, అప్పటి నుంచి నిహారిక నటనతో పాటు ప్రొడక్షన్లో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఫోటోలతో సందడి చేస్తుంది.
also read :
సమంత షాకింగ్ నిర్ణయం.. ఆ కారణంగా సినిమాలకు విరామం..!
Caterpillar : గొంగళి పురుగుల దండయాత్ర.. పాఠశాల మూసివేత.. ఎక్కడంటే ?