Niharika: మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతో పెద్దగా సక్సెస్ సాధించకపోయిన కూడా మంచి పాపులారిటీ అయితే సంపాదించుకుంది.
అయితే నిహారిక, నాగబాబు తండ్రి కూతుళ్ల మాదిరిగా కాకుండా ఫ్రెండ్స్‌లా చాలా అన్యోన్యంగా ఉంటారు. వారిద్దరు సరదాగా ఉండే కొన్ని వీడియోలని చూస్తే భలే అనిపిస్తుంటుంది. కూతురికి ప్రతి విషయంలో నాగబాబు అండగా ఉంటాడు.
ఇటీవల జరిగిన పబ్ ఇష్యూలో కూడా నాగబాబు తన కూతురికి సపోర్ట్‌గా నిలిచాడు. నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారని, అనుమానాలకు తావు ఇవ్వకూడదనే స్పందించానని, అనవసరంగా పెద్ద విషయం చేయొద్దని నాగబాబు అన్నారు.
అయితే నాగబాబు కొద్ది రోజులుగా కుడిచేతికి గాయంతో కనిపిస్తున్నాడు. వరుణ్ తేజ్ కొత్త మూవీ లాంచ్ లో కూడా గాయంతోనే కనిపించాడు. అయితే నొప్పితో ఇబ్బంది పడుతున్న నాగబాబు చేతి నొప్పిని పోగొడతానని చెప్పినన నిహారిక నీ నొప్పిని తీసేస్తా అంటూ చేయి కొరికింది.
దీనితో నాగబాబు గట్టిగా అరుస్తారు. నొప్పి తగ్గిపోయింది అని నిహారిక అనగా.. ఈ చేతికి వచ్చింది కదమ్మా అని అమాయకంగా చెప్పుకొచ్చారు నాగబాబు. నిహారిక అల్లరికి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన నాగబాబు.. ముల్లుని ముల్లుతోనే తీయడం అంటే ఇదేనేమో అని కామెంట్ పెట్టారు. మీ ఇంట్లో ట్రై చేయొద్దు. ఇది డాక్టర్ నిహారిక పర్యవేక్షణలో జరిగింది అని తన వీడియోకి కామెంట్ పెట్టాడు.
సినిమాల్లోకి రావడానికి ముందే ఓ చానెల్‌లో ప్రసారం అయిన ‘ఢీ’ అనే డ్యాన్స్ షోకు నిహారిక కొణిదెల యాంకర్‌గా చేసి అలరించింది. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలోనూ నటించి, అదే క్రమంలోనే ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ అనే బ్యానర్ స్థాపించి.. ‘ముద్దపప్పు ఆవకాయ్’, ‘నాన్న కూచీ’ అనే వెబ్ సిరీస్‌లను నిర్మించి, నటించింది.
‘ఒక మనసు’ అనే సినిమాతో హీరోయిన్‌గానూ పరిచయమైన నిహారిక.. తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ వంటివి చేసింది. ఈ సినిమాలు ఏవి పెద్దగా సక్సెస్‌లు సాధించలేదు.
View this post on Instagram