Niharika : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మెగా ఫ్యామిలీ నుండి నటిగా ఎదిగింది ఒక్క నిహారిక మాత్రమే. నాగబాబు కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయిన ఈ అమ్మడు మొదటగా యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. అనంతరం హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అయితే నిహారిక ‘ఢీ’ అనే డ్యాన్స్ షోతో యాంకర్‌గా కూడా అలరించింది. అందులో తన మాటలతో మెప్పించిన ఈ బ్యూటి ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తో కూడా అదరగొట్టింది.
ఇక కొన్ని రోజులకు ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ అనే బ్యానర్ ఏర్పాటు చేసి ‘ముద్దపప్పు ఆవకాయ్’, ‘నాన్న కూచీ’ అనే వెబ్ సిరీస్‌లను నిర్మించడంతో పాటు అందులో నటించి అదుర్స్ అనిపించింది. కెరీర్ ఆరంభంలోనే మంచి పేరు తెచ్చుకున్న నిహారిక 2016లో వచ్చిన ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై తెరంగేట్రం చేసి నటిగా తన ప్రయత్నాలు చేసింది. కాని ఒక్క మంచి హిట్ కూడా దక్కలేదు.
వరుస ఫ్లాపులు పలకరిస్తున్న సమయంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చి సినిమాలకు బ్రేక్ ఇచ్చి చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. కొద్ది రోజుల పాటు వీరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అయితే ఇటీవల నిహారిక, చైతన్య విడిపోయారనే వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. నిహారిక మాత్రం వాటిపై ఏ మాత్రం స్పందించడం లేదు.
ఈ అమ్మడు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ తో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. నిహారిక తాజాగా నటించిన వెబ్ సిరీస్ డెడ్ పిక్సెల్స్ ని ఆదిత్య మండల దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 19 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అయితే ఇందులో గాయత్రిగా కనిపించిన నిహారిక ఇద్దరిని ఇష్టపడుతున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని డైలాగ్స్ కూడా కాస్త ఇబ్బందిగా ఉండడంతో ఆమెని తెగ ట్రోల్ చేస్తున్నారు.
పట్టించుకుంటే రెచ్చిపోతారు
‘ఇలాంటి చిల్లర వెబ్ సిరీస్ తీసి సోసైటీని ఇంకా చెడగొట్టకండి అంటూ పలువురు విమర్శిస్తుంటే అవేమి పట్టించుకోని నిహారిక తనదైన శైలిలో దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ అమ్మడు ప్రమోషన్ లో భాగంగా తనపై వచ్చే విమర్శలపై స్పందించింది. జనరల్‌గా ‘పని పాట లేనివాళ్లే ఇలా ట్రోల్స్ చేస్తారు. అలాంటి వారి గురించి నేను పెద్దగా పట్టించుకోను.
మనం స్పందిస్తే.. మనం అవసరం లేనివారికి అటెన్షన్ ఇస్తున్నట్టు అవుతుంది.. ప్రతిచోట ఇడియట్స్ ఉంటారు. వాళ్లను పట్టించుకుంటే ఇంకా రెచ్చిపోతారు. నా వరకైతే.. అలాంటి వారిని నేను అస్సలు పట్టించుకోను. నన్ను అభిమానించే వాళ్లు, ఇష్టపడే వాళ్లు చాలా మంది ఉన్నారు కాబట్టి కాస్త ఖాళీ టైమ్ దొరికినా వాళ్లకు ఆ సమయం కేటాయిస్తా. ఎవడో కోన్ కిస్కా గొట్టం గాడి గురించి నేనెందుకు పట్టించుకుంటా? అంటూ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ పై ఘాటుగానే స్పందించింది నిహారిక. ఈ అమ్మడు ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదు అని కూడా బదులు ఇచ్చింది.
also read :
Gold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (18-05-2023)
Weather Today (18-05-2023): రాగల మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే..