న్యూజిలాండ్ (New Zealand) దేశంలో సాధారణంగానే క్రమశిక్షణ జీవితం గడిపేలా అక్కడి ప్రభుత్వం పౌరులకు సూచిస్తూ ఉంటుంది. ప్రపంచంలోనే న్యూజిలాండ్ అనేక అంశాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. గ్రీనరీని కాపాడటంలో ఆ దేశం ముందువరుసలో ఉంటుంది. రీసెంట్‌గా కరోనా నియంత్రణలోనూ అక్కడి ప్రజలు, ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు. తాజాగా ప్రపంచానికే ఆదేర్శంగా నిలిచేలా సంచలన నిర్ణయం తీసుకుంది న్యూజిలాండ్ ప్రభుత్వం.
సిగరెట్ తాగడం ఇప్పుడు చాలా దేశాల్లో ఫ్యాషన్‌గా మారింది. యువత, పెద్దలు, చిన్నారులు కూడా వీటికి కాల్చుతూ పొగాకుకు బానిసలుగా మారిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పొగాకు వినియోగం నానాటికీ పెరుగుతున్న క్రమంలో మానవాళికి పెనుముప్పుగా మారుతోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌లో పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. పొగాకును ఉక్కుపాదంతో అణచివేయడానికి కఠిన చర్యలకు పూనుకుంది.
పొగాకు వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కొత్త చట్టాన్ని తెచ్చింది న్యూజిలాండ్ ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం యువత సిగరెట్లు కొనడానికి వీలుండదు. 2009 జనవరి 1 తర్వాత పుట్టిన వారు అక్కడ సిగరెట్లు కొనకుండా జీవితకాల నిషేధం విధించారు. ఇలాంటి వారికి ఎవరైనా సిగరెట్లు విక్రయిస్తే కఠిన శిక్షలు అమలు చేసేలా కొత్త చట్టంలో పొందుపరిచారు.
న్యూజిలాండ్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం ఏటా సిగరెట్ల వినియోగం గణనీయంగా తగ్గిపోనుంది. తద్వారా దేశం మొత్తం టొబాకో రహితంగా మార్చాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. న్యూజిలాండ్‌లో ప్రస్తుతం సిగరెట్లు విక్రయించేందుకు అనుమతి ఉన్న రిటైలర్ల సంఖ్యను భారీగా కుదించేసింది ప్రభుత్వం. కొత్త చట్టం ప్రకారం 6 వేలు ఉన్న ఈ రిటైలర్ల సంఖ్యను 600కు తగ్గించింది. సిగరెట్లలో ఉండే నికోటిన్ పరిమాణాన్ని కూడా తగ్గించింది ప్రభుత్వం. మనిషిని తీవ్ర అనారోగ్యాలకు గురి చేసే సిగరెట్లను విక్రయించడంలో అర్థం లేదని ఈ చట్టం తీసుకొచ్చిన సందర్భంగా న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ పేర్కొంది.
also read news:
Special Stories : భయపెట్టే పర్యాటక ప్రదేశం.. అది ఎక్కడుంది? అక్కడ ఎవరు చనిపోయారు?
viral video : నాన్న పుట్టిన రోజున.. డ్రీమ్ బైక్ గిఫ్టుగా ఇచ్చిన కుమారుడు.. చూస్తే కన్నీళ్లు ఆగవు!