Telugu Flash News

Naga Chaitanya: ఉగాది రోజు నాగ చైత‌న్య కొత్త‌ ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త వ్య‌క్తి.. ఎవ‌రో తెలుసా?

naga chaitanya chandoo mondeti

naga chaitanya chandoo mondeti

Naga Chaitanya: ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘కస్టడీ’ చిత్రం చేస్తుండ‌గా, ఈ మూవీని మే 12న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంతో అయిన మంచి హిట్ కొట్టాల‌ని అనుకుంటున్నారు. ఇక నాగ చైత‌న్య ఇటీవల నాగార్జున ఇంటికి దగ్గరలో ఉన్న ఓ ఖాళీ స్థలంలో తన అభిరుచికి తగ్గట్లుగా లగ్జరీ హౌస్ ని నిర్మించుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ ఇంటికి గృహప్రవేశం చేసినట్లు కూడా వార్తలు రాగా, ప్రస్తుతం చైతు ఆ ఇంట్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది.

Viral Video : మర్రిచెట్టు వంతెన చూశారా? నది దాటాలంటే సాహసమే!

అయితే ఉగాది సందర్భంగా నాగ చైతన్య ఇంట్లోకి ఊహించని అతిథి అడుగుపెట్టారు. మొదటి అతిథిని చూసి ఫ్యాన్స్ సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారు. మ‌రి అతనెవరో కాదు రీసెంట్ గా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన యువ డైరెక్టర్ చందూ ముండేటి.

చందూ ముండేటికి, నాగ చైతన్యకి మొద‌టి నుండి మంచి సాన్నిహిత్యం ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సవ్యసాచి అనే చిత్రం రాగా, ఈ మూవీ ఫ్లాప్ అయిన‌ప్ప‌టికీ ఇద్ద‌రి మధ్య ఫ్రెండ్ షిప్ కొనసాగుతోంది.

Viral Video: అమ్మాయిలూ.. బైక్‌పై ఇలాంటి ఫీట్లు అవసరమా? తృటిలో తప్పిన ప్రమాదం..

నాగ చైతన్య కొత్త ఇంటిని విజిట్ చేయడంపై చందూ సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తూ… ‘ఉగాది రోజు యువసామ్రాట్ కొత్త ఇంట్లో.. మొదటి అతిథిని నేనే .. కంగ్రాట్స్ నాగ చైతన్య ‘అని త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు.

Exit mobile version