Telugu Flash News

Anasuya: నీ కొడుకుల‌కి వంట నేర్పించు అంటూ అన‌సూయ‌కి కౌంట‌ర్.. ఎలా రెస్పాండ్ అయిందంటే..!

Anasuya Latest Saree Stills in March 2023

Anasuya: ఫైర్ బ్రాండ్ అనసూయకి సోష‌ల్ మీడియాలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె త‌ర‌చు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల ప్రశ్న‌ల‌కు స‌మాదానం ఇస్తుంటుంది.

అయితే సిటాడెల్ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్న ప్రియాంక చోప్రా స్త్రీ పురుష సమానత్వం గురించి మాట్లాడుతూ.. ఈ రోజుల్లో మహిళలు ఉద్యోగం చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేక‌పోతున్నారు. కాని మా కుటుంబంలో నన్ను నా భర్త నిక్ ఎంతో ప్రోత్సాహంగా ఉంటార‌ని చెప్పింది. ప్రియాంక వీడియో షేర్ చేసిన అనసూయ ఆమెను సమర్థిస్తూ ఓ కామెంట్ పెట్టింది.

కుటుంబ సభ్యులు ఒకరినొకరు గౌరవించుకుంటూ, అర్థం చేసుకుంటూ క‌లిసిక‌ట్టుగా ప‌ని చేస్తూ ముందుకు సాగాలి. చాలా కుటుంబాల్లో ఇది కనిపించడం లేదు. ఆడామగా కలిసి పని చేసినప్పుడే ప్రపంచం అభివృద్ధి జ‌రుగుతుంద‌ని అన‌సూయ పేర్కొంది.

దీనికి ఓ నెటిజ‌న్… నీ పిల్లలకు ముందు వంట నేర్పు. ఉద్యోగం చేసే భార్యల కోసం ఇంటి పనులు అన్నీ చక్కబెడతారు… అని అన్నాడు. దానికి కౌంట‌ర్‌గా అనసూయ… నా 11 ఏళ్ల కొడుకు ఇప్పుడు వంట చేస్తున్నాడు కూడా.

అప్పుడ‌ప్పుడు నాకు కిచెన్ లో సహాయం చేస్తుంటాడు. ఇంటి పనులే కాదు కుటుంబాన్ని ఎలా పోషించాలో కూడా నా కొడుకులకు నేర్పిస్తాను కాని నువ్వు నీ పని చూసుకో అంటూ ఘాటుగా స్పందించింది అన‌సూయ‌. ప్ర‌స్తుతం ఆమె కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Anasuya : ఆంటీ అంటే త‌న‌కు కోపమెందుకో చెప్పేసిన అన‌సూయ‌

Anasuya: అంద‌రి ముందు ఎమోష‌న‌ల్ అవుతూ వెక్కి వెక్కి ఏడ్చిన అన‌సూయ‌

Exit mobile version