HomecinemaAnasuya: అంద‌రి ముందు ఎమోష‌న‌ల్ అవుతూ వెక్కి వెక్కి ఏడ్చిన అన‌సూయ‌

Anasuya: అంద‌రి ముందు ఎమోష‌న‌ల్ అవుతూ వెక్కి వెక్కి ఏడ్చిన అన‌సూయ‌

Telugu Flash News

Anasuya:  అందాల భామ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. యాంక‌ర్‌గా, న‌టిగా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న అన‌సూయ నేడు విడుద‌ల కానున్న రంగ‌మార్తాండ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించింది.

సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, సీనియర్ నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇళయరాజా సంగీతం అందించారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించ‌గా, ఆ ప్రెస్ మీట్ లో అనసూయ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయింది.

also read : Anasuya Latest Saree Stills, Images, Photos 2023

moral stories in telugu : చేసిన సహాయం ఎప్పుడూ వృధాకాదు

సినిమా ప్రివ్యూ చూశాను. సినిమా చాలా బాగుంది. నా జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది. రంగమార్తాండ లాంటి చిత్రంలో నేను ఉన్నాననేది చాలా సంతోషానిస్తోందని పేర్కొంది అన‌సూయ‌. అంతే కాదు మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టుకొని, అందరి ముందే ఏడ్చేసింది.

ఇక రంగ‌మార్తాండ చిత్రం విష‌యానికి వ‌స్తే రంగస్థల నటీనటుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని మరాఠిలో తెరకెక్కిన సక్సెస్ ఫుల్ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు రీమేక్ గా తెలుగులో ఈ చిత్రం రూపొందింది. ఫ్యామిలీ డ్రామాని కొత్తగా ఆవిష్కరించిన చిత్రంగా చెబుతుండ‌గా, ఈ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ తోపాటు శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజ ముఖ్య పాత్రలు పోషించారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News