HomecinemaNayanthara: న‌య‌న‌తార కొత్త వ్యాపారం.. మ‌హేష్‌, అల్లు అర్జున్ బాట‌లోనే..!

Nayanthara: న‌య‌న‌తార కొత్త వ్యాపారం.. మ‌హేష్‌, అల్లు అర్జున్ బాట‌లోనే..!

Telugu Flash News

Nayanthara: ఇటీవల చాలా మంది సెల‌బ్రిటీలు ఒకవైపు సినిమాల‌లో రాణిస్తూనే మ‌రోవైపు వ్యాపార రంగంలో కూడా స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ హీరోలు చాలా మంది బిజినెస్ లు చేస్తూ లాభాలు పొందుతున్నారు. మ‌హేష్‌, అల్లు అర్జున్ థియేట‌ర్స్ క‌ట్టించి వాటితో కూడా లాభాలు రాబ‌డుతున్నారు. అయితే ఇదే బాట‌ల‌తో సౌత్ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార కూడా ప‌యనించేందుకు సిద్ధ‌మ‌వుతుంది. గత ఏడాది తన ప్రియుడు విగ్నేష్ శివ‌న్ ని వివాహం చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిగా కూడా మారింది న‌య‌న‌తార‌. ప్రస్తుతం ఈ అమ్మ‌డు పిల్ల‌ల బాగోగులు చూసుకుంటూనే పలు చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నయన్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం విదిత‌మే

నయనతార, విగ్నేష్ శివన్ జోడి ఎక్కడ కనిపించినా అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున రావ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. వీరిద్ద‌రిని చూడ‌ముచ్చ‌టైన జంట అంటూ చాలా మంది ప్ర‌శంస‌లు కూడా కురిపించారు. ప్ర‌భుదేవా శింబుల ప్రేమాయ‌ణం బెడిసి కొట్టిన త‌ర్వాత న‌య‌న‌తార‌.. విఘ్నేష్ శివ‌న్ ప్రేమ‌లో ప‌డి అత‌నిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈ జంట భారీగా లాభాలు రాబ‌ట్టే బిజినెస్ కోసం ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే నయనతార హీరోయిన్ గా సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటుంద‌నేది అందరికి తెలిసిన విష‌య‌మే. అయితే వారిరివురు ఇప్పుడు సొంత ప్రొడక్షన్ కూడా ప్రారంభించారు. అంతేకాదు నయనతార అనేక వ్యాపారాల్లో భాగ‌స్వామిగా మారుతుంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం న‌య‌న‌తార కొత్త బిజినెస్ ప్రారంభించబోతున్నట్లు వినికిడి. థియేటర్ బిజినెస్ లోకి ఈ అమ్మ‌డు అడుగుపెట్టే ఆలోచ‌న చేస్తుందని కోలీవుడ్ మీడియా వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌న ద‌గ్గ‌ర మహేష్ బాబు ఏఎంబి సినిమాలో భాగస్వామిగా ఉండ‌గా, అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్ ప్ర‌స్తుతం నిర్మాణ ద‌శ‌లో ఉంది. విజ‌య్ దేర‌కొండ కూడా థియేట‌ర్ బిజినెస్ లో భాగ‌స్వామిగా ఉన్నాడు. వారి బాట‌లో ఇప్పుడు నయ‌నతార వ‌స్తుండ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది . ఇక అదే తరహాలో విలాసవంతమైన, అత్యాధునికమైన మల్టిఫ్లెక్స్ ని చెన్నైలో నయ‌న‌తార నిర్మించ‌నుంద‌ని అంటున్నారు. చెన్నైలో మూతపడ్డ అగస్త్య థియేటర్ ని నయన్ కొనుగోలు చేసి దాని స్థానంలో కొత్త మల్టిఫ్లెక్స్ నిర్మాణానికి ప్లాన్స్ వేస్తుంద‌ని టాక్. మ‌రి దీనిపై రానున్న రోజుల‌లో క్లారిటీ రానుంది.

also read :

Vastu tips in telugu : ఇలాంటి వస్తువులు మీ చేతిలోంచి జారిపోతే అశుభం!

Andhra Pradesh: యూట్యూబ్‌లో చూసి దొంగ నోట్ల ముద్రణ.. టీ అమ్ముతూ నోట్లు మార్చాడు!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News