HometelanganaNaveen Murder Case : నవీన్‌ను హత్య చేసిన రోజు హరిహర కృష్ణ ఏమేం చేశాడు? దర్యాప్తులో షాకింగ్‌ నిజాలు..

Naveen Murder Case : నవీన్‌ను హత్య చేసిన రోజు హరిహర కృష్ణ ఏమేం చేశాడు? దర్యాప్తులో షాకింగ్‌ నిజాలు..

Telugu Flash News

Naveen Murder Case : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్‌ హత్య కేసులో రోజు రోజుకూ విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా ఒళ్లు గగుర్పొడిచే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

హత్య చేయాలని ప్లాన్‌ చేసుకున్న హరిహరకృష్ణ.. అందుకు కావాల్సిన సరంజామా ముందే సిద్ధం చేసుకున్నాడని విచారణలో వెల్లడైంది. అసలు హత్య జరిగిన రోజు ఏమేం చేశాడనే అంశాలను పోలీసులకు పూసగుచ్చినట్లు వెల్లడించాడు హరిహరకృష్ణ.

నవీన్‌ను ఏ విధంగా హతమార్చాడు?

హత్య జరిగిన రోజున వారిద్దరూ ఎక్కడ కలిశారు? ఎక్కడెక్కడ తిరాగరనే వివరాలు బహిర్గతమయ్యాయి. ఫిబ్రవరి 17వ తేదీన ఉదయం 9 గంటలకు హరిహరకృష్ణకు నవీన్‌ ఫోన్‌ చేశాడు. తాను హైదరాబాద్‌కు వస్తున్నట్లు వెల్లడించాడు. తర్వాత హరిహర నగరంలోని ఓ ఫ్రెండ్‌కు ఫోన్‌ చేసి ఇద్దరూ కలిసి ఓ హాలీవుడ్‌ మూవీకి వెళ్లారు.

తర్వాత నాగోల్ లోని ఓ రెస్టారెంట్‌కు ఇద్దరూ భోజనం చేయాలని వెళ్లారు. ఈ సమయంలోనే నవీన్‌.. హరిహరకు ఫోన్‌ చేశాడు. ఎల్బీ నగర్‌లో ఉన్నానని చెప్పడంతో స్నేహితుడితో కలిసి హరిహర నవీన్‌ వద్దకు చేరుకున్నారు. నవీన్‌ను కూడా బతీసుకొని రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేశారు. తర్వాత అదే రోజు స్నేహితురాలికి ఓ మొబైల్‌ఫోన్‌ను హరిహర కొనిచ్చాడు.

ఇదే క్రమంలో నవీన్‌ను హరిహరకృష్ణ ముసరంబాగ్‌లోని తన సోదరి ఇంటికి తీసుకెళ్లాడు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా స్నేహితురాలి నుంచి ఫోన్‌ వచ్చింది. సెల్‌ఫోన్‌ కొనడానికి హెల్ప్‌ చేయాలని ఆమె కోరడంతో నవీన్‌తో కలిసి చైతన్యపురిలోని మొబైల్‌ షాప్‌కు వెళ్లారు.

అక్కడ డబ్బులు తక్కువ కావడంతో లోన్‌ యాప్‌ నుంచి 14 వేల రూపాయలు, పేటీఎం పోస్ట్‌ పెయిడ్‌లో 4 వేల రుణం తీసుకొని స్నేహితురాలికి ఫోన్‌ కొనిచ్చాడు హరిహర. ఇలా 30 వేల రూపాయల విలువజేసే సెల్‌ఫోన్‌ను స్నేహితురాలికి ఇచ్చాడు.

-Advertisement-

ఇక మళ్లీ ఇంటికి చేరుకున్న నవీన్‌, హరిహర.. మాటల్లో పడ్డారు. తాను ఎంజీ వర్సిటీ హాస్టల్‌కు వెళ్లాలని నవీన్‌ చెప్పాడు. దీంతో తాను బైక్‌పై దిగబెడతానని హరిహర నమ్మబలికాడు. దీంతో అప్పటికే కత్తి, చేతి గ్లౌజులు ఉంచిన బ్యాగును తన బైక్‌లో సిద్ధంగా పెట్టుకున్నాడు హరిహరకృష్ణ.

ఇక బయల్దేరగానే మార్గం మధ్యలో పెద్ద అంబర్‌ పేటలో నవీన్‌కు మద్యం తాపించాడు. అనంతరం ఇద్దరూ కలిసి రాత్రి 11.30 గంటలకు ఔటర్‌ రింగురోడ్డు దాటగానే నవీన్‌ ప్రేమించిన నిహారికతో మాట్లాడాలంటే హరిహర ఫోన్‌ చేసి నవీన్‌కు ఇచ్చాడు.

అనంతరం మాట్లాడిన తర్వాత నిహారికకు సంబంధించిన సీక్రెట్‌ ఒకటి చెప్తానంటూ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే అత్యంత కర్కశంగా శరీర భాగాలు కోసేస్తూ హత్య చేశాడు. ఇలా ఎలాంటి అనుమానాలు రాకుండా దారుణ హత్య చేయడంపై పోలీసులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

also read :

Chiranjeevi: వేణు నువ్వు ఇలాంటి షాకులిస్తే ఎలా చెప్పు.. చిన్న ఆర్టిస్ట్‌ని ఆకాశానికి ఎత్తిన చిరు

moral stories in telugu : గుంటనక్క గొప్పలు.. కథ చదవండి

Venkatesh: వెంక‌టేష్ నోటి నుండి ఆ మాట రావ‌డంతో ఉలిక్కిప‌డ్డ ఫ్యాన్స్..!

Sai Pallavi: డ్యాన్సింగ్ పార్ట్న‌ర్‌గా ఎన్టీఆర్‌, బ‌న్నీ, చ‌ర‌ణ్‌ల‌లో సాయి ప‌ల్ల‌వి ఓటెవ‌రికి అంటే..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News