HomecinemaNani : చ‌ర‌ణ్‌ని అవ‌మానించేలా మాట్లాడిన నాని.. చ‌ర్చ‌నీయాంశంగా మారిన కామెంట్స్

Nani : చ‌ర‌ణ్‌ని అవ‌మానించేలా మాట్లాడిన నాని.. చ‌ర్చ‌నీయాంశంగా మారిన కామెంట్స్

Telugu Flash News

Nani comments on nepotism in nijam with smita show:  నేచుర‌ల్ స్టార్ నాని ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే హిట్స్, ఫ్లాప్స్ లేకుండా దూసుకుపోతున్న నాని ద‌స‌రా అనే సినిమాతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఆయ‌న నిజం విత్ స్మిత షోకి రానాతో పాల్గొన్నాడు. ఇందులో నెపోటిజంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

సుశాంత్ సింగ్ మ‌ర‌ణం త‌ర్వాత దీనిపై తెగ చ‌ర్చ న‌డుస్తుండ‌గా, తాజాగా దీని గురించి నానికి ప్ర‌శ్న ఎదురైంది. దీనిపై స్పందించిన నాని.. అసలు నెపోటిజంని పెంచి పోషిస్తుంది ప్రేక్షకులే. నాని డెబ్యూ మూవీ లక్షల్లో చూస్తే రామ్ చరణ్ డెబ్యూ మూవీ కోట్లలో చూశారు. మ‌రి ఆ లెక్కన నెపోటిజాన్ని ప్రోత్సహిస్తుంది జనాలే కదా అని ఆయ‌న కామెంట్ చేశారు.

ఇక రానా మాట్లాడుతూ.. తల్లిదండ్రుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పిల్లల మీద త‌ప్ప‌క ఉందని చెప్పుకొచ్చాడు. పిల్లలు దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన‌ప్పుడే వాళ్ళు విజయం సాధించినట్లని రానా స్ప‌ష్టం చేశారు.

నెపోటిజం గురించి నాని మాట్లాడుతూ చ‌ర‌ణ్‌ని అవ‌మానించేలా నాని కామెంట్ చేశాడ‌ని, క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఏం త‌ప్పుంది అని నాని అభిమానులు వాటికి స్పందిస్తున్నారు.

also read:

రుచిగా ఉన్నాయని ఈ ఆహారాలు లాగించేస్తున్నారా? జాగ్రత్తలు తప్పనిసరి!

-Advertisement-

heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News