Telugu Flash News

Nani: ఆ డైరెక్ట‌ర్స్ నా డ‌బ్బులు దోచుకున్నారంటూ నాని సంచ‌ల‌న కామెంట్స్

actor nani

Nani: స్వ‌యంకృషితో ఎదిగి మంచి హీరోగా పేరు తెచ్చుకున్ హీరో నాని మ‌రి కొద్ది రోజుల‌లో ‘దసరా’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రింబోతున్నారు. ఈ క్ర‌మంలో వ‌రుస ప్ర‌మోష‌న్స్ చేసుకుంటున్న నాని .. మాస్ మహారాజా రవితేజతో కలిసి చిట్ చాట్ చేశాడు. ఈ చిట్​చాట్​లో నాని ఆసక్తికరమైన విషయాలను వెల్ల‌డించారు.. తన కెరీర్​తో పాటు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాల గురించి చెప్పుకొచ్చారు.

సినిమా అవకాశాల కోసం ఫొటో ఆల్బమ్స్ పట్టుకుని తాను ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగే క్ర‌మంలో కనీసం తనను లోపలికి కూడా రానివ్వలేదు. చిన్న క్యారెక్ట‌ర్స్ అయిన చేద్దామ‌ని ట్రై చేస్తున్న స‌మ‌యంలో ఒకరిద్దరు కో డైరెక్టర్స్ నన్ను డ్రైవర్​లా కూడా వాడుకున్నారు. నాతో అనేక రకరకాల పనులు చేయించుకున్నారు. అంతేకాదు నా ఏటీఎంలో పండుగలకు బట్టలు కొనుక్కునేందుకు దాచిన డబ్బుల్ని కూడా వారు కాజేశారు. ఈ స్కాములన్నీ చూశాక మళ్లీ మోసపోవడం తన వల్ల కాదని నటుడిగా ప్రయత్నాలు ఆపేసి అసిస్టెంట్ డైరెక్టర్​గా మారానంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు నాని.

also read :

banana hair mask : అరటి పండుతో హెయిర్‌ మాస్క్.. మీ జుట్టు నిగనిగలాడటం గ్యారెంటీ!

Exit mobile version