Naga chaitanya : సోషల్ మీడియాలో ఆటం బాంబులా అందాలు ఆరబోసే భామ శోభిత ధూళిపాళ. ఇటీవల ఈ అమ్మడు ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. తన ఘాటైన పరువాలతో శోభిత చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందాలు ఆరబోసేందుకు, సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ పండించేందుకు శోభిత ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు. ఇక గత కొన్ని నెలలుగా నాగ చైతన్య, శోభిత ధూళిపాళ రిలేషన్ లో ఉన్నారంటూ తెగ ప్రచారాలు జరుగుతున్నాయి. వీటికి సాక్ష్యంగా కొన్ని ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.
రీసెంట్ గా నాగ చైతన్య , శోభిత లండన్ కి డిన్నర్ డేట్ కోసం వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అందుకు కారణం అక్కడ ఓ రెస్టారెంట్ లోని చెఫ్ సురేందర్ మోహన్.. నాగ చైతన్య ని చూసి అతడితో ఫోటోకి పోజులిచ్చారు. ఈ ఫొటోలో వెనుకాల టేబుల్ వద్ద శోభిత కూర్చొని ఉండడం మనం గమనించవచ్చు. ఈ పిక్ చూసి ఇద్దరు సరాదాగా లండన్ టూర్ వేసినట్టు ఉన్నారు.
ఇద్దరి మధ్య రిలేషన్ కంఫర్మ్ అంటూ వైరల్ చేశారు. అయితే తాజాగా సురేందర్ మోహన్ ఆ పిక్ ని డిలీట్ చేయడంతో శోభిత, చైతు డేటింగ్ రూమర్స్ మరింతగా బలపడినట్లు అయింది. తమ రిలేషన్ ని సీక్రెట్ గా ఉంచేందుకే శోభితా, చైతు ఆ పిక్ ని డిలీట్ చేయించి ఉంటారనే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Manchu Vishnu : మంచు బ్రదర్స్ గొడవలో ఊహించని ట్విస్ట్.. ఇదంతా రియాలిటీ షో కోసమా?
Samantha : తొలిసారిగా విడాకులపై స్పందించిన సమంత