Telugu Flash News

Naga Chaitanya: శాకుంతలం ఫ్లాప్‌కి నాగ చైత‌న్య కార‌ణమా.. ఈ మాట అన్న‌ది ఎవ‌రో తెలుసా?

shakuntalam review

Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ న‌టించిన తాజా చిత్రం శాకుంత‌లం. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో విడుద‌ల కాగా, ఈ మూవీ నెగెటివ్ టాక్ మూట‌గ‌ట్టుకుంది. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి. కాని అక్కినేని అభిమానుల వ‌ల‌నే సినిమా ఫ్లాప్ అయింద‌ని బిగ్ బాస్ బ్యూటీ ఆరోహి సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. పురాణాల గురించి తెలియని వారికి ఈ సినిమా పంచ తంత్రం కథలాగే కనిపిస్తుంది అని పేర్కొంది.

చిత్రం ప్లాప్ అవ్వడానికి నాగ చైతన్య ఫ్యాన్స్ కూడా ఒక కారణం అని చెప్పుకొచ్చింది. సమంత నటన బాగాలేదని చెప్పిన వారు నాగ చైతన్య అభిమానులే అని పేర్కొంది.. ఉన్నది తీశారు కాబట్టే ఈ సినిమా ప్లాప్ అయిందని, అదే కొంచెం ఫిక్షన్, మసాలా జోడిస్తే ఈ సినిమా హిట్ పడేదని ఆరోహి షాకింగ్ కామెంట్స్ చేసింది. . ఇక అల్లు అర్హ గురించి మాట్లాడుతూ.. అర్హ బాగా చేసింది. కానీ అంత కంటే బాగా చేసే చైల్డ్ ఆర్టిస్టులు బయట అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అని కీల‌క వ్యాఖ్య‌లు చేసింది అంటూ ఆరోహి చెప్పుకొచ్చింది.

also read :

moral stories in telugu :  నిన్ను నీవు నిందించుకోకు..

Horoscope (20-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Exit mobile version