Kalki 2898AD : ప్రభాస్, దీపిక పదుకోన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటీనటులుగా నటించిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కల్కి 2898AD. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ రెండుసార్లు వాయిదా పడింది. ఈ సినిమా ఆలస్యానికి అసలు కారణం ఇంజనీరింగ్ పనులకు చాలా సమయం పడుతోందని నాగ్ అశ్విన్ తెలిపారు.
ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న నాగ్ అశ్విన్, “ఈ సినిమాలో కనిపించే సెట్స్‌తో పాటు ప్రతి ఆయుధం, వస్తువులను సరి కొత్తగా తీర్చిదిద్దుతున్నాం. అందుకే వాటికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇప్పటివరకూ ఇండియన్ సినిమా హిస్టరీలో చూడని విధంగా ఈ సినిమాని చూపించబోతున్నాం. ఈ సినిమా ద్వారా భవిష్యత్తు ప్రభాస్‌ని చూస్తారని నాకు నమ్మకం” అన్నారు.
ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ స్టోరీగా వస్తున్న ఈ చిత్రం విడుదలకు ఇంకా సమయం ఉంది.
also read :
KALKI : కల్కి అవతారం కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? కలియుగంలో ఇంకా సజీవంగా ఉన్నది ఎవరు?
KALKI : కల్కి ఎవరు? కల్కి అవతారం గురించి తెలుసుకోండి !