HomesportsMs Dhoni: నా బ్యాటింగ్‌లో టెక్నిక్ ఉండ‌దు.. క‌ళ్లు మూసుకొని షాట్స్ ఆడ‌తానంటూ ధోని కీల‌క వ్యాఖ్యలు

Ms Dhoni: నా బ్యాటింగ్‌లో టెక్నిక్ ఉండ‌దు.. క‌ళ్లు మూసుకొని షాట్స్ ఆడ‌తానంటూ ధోని కీల‌క వ్యాఖ్యలు

Telugu Flash News

Ms Dhoni: టీమిండియాకు ఎందరో కెప్టెన్లు వచ్చారు ,కానీ అంద‌రిక‌న్నా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో మాజీ కెప్టెన్ ధోనీ త‌ప్ప‌క ఉంటారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా ధోనీ లెవెల్లో జట్టును ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. కెప్టెన్‌గా మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీకి దేశవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కంటే ధోనీకే అభిమానులు ఎక్కువ ఉన్నారు. దీనికి కారణాన్ని స్వయంగా వివరించాడు మ‌హేంద్ర సింగ్ ధోని.

‘జనాలు నా మీద చూపిస్తున్న ఆదరణ, అభిమానం నేనెప్పుడూ అస్స‌లు ఊహించలేదు. నన్ను మాహీ భాయ్, ఎంఎస్ భాయ్ అని పిలవడం.. నాలో ఏదో ప్రత్యేకత ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది.. నిజానికి జనాలు నన్ను ఇంత ఇష్టపడడానికి నేను వారిలో ఒకరిగా ఫీల్ అవ్వడమే కారణం అని అన్నాడు. ఇక నేను సాధారణ జనం ఆడినట్టే క్రికెట్ ఆడతాను. నా బ్యాటింగ్‌లో పెద్ద‌గా టెక్నిక్ ఉండదు, కళ్లు మూసుకుని షాట్స్ కొట్టినట్టు కొడతాను అంతే! అదే సచిన్ పాజీ ఆటను చూస్తే, ఎవ్వరైనా ఆయనలా మనం ఆడలేమని అంటారు.

నా బ్యాటింగ్ చూస్తే, నాలా ఎవ్వరైనా ఆడొచ్చు. అందుకే ఇలా నేను కూడా ఆడగలననే జనాలు ఫీల్ అవుతారు.నాలో వారిలో ఒకరిగా మార్చుకుంటూ ఉంటారు.. నా కెరీర్‌లో నాకు ఎలాంటి నిరాశ లేదు. ఇప్పటిదాకా సాధించిన దాంతో చాలా సంతృప్తితో ఉన్నాను. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో స్టేడియంలోని ప్రేక్షకులంతా కలిసి వందే మాతరం పాడుతుంటే నా ఒళ్లు జలదరించింది. అలాగే 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచి స్వదేశానికి వచ్చిన తర్వాత ముంబైలో మాపై జనాలు చూపించిన ప్రేమ… ఆ రెండూ జీవితంలో ఎప్ప‌టికీ మరిచిపోలేను… దేశం తరుపున ఆడడాన్ని నాకు దక్కిన అతి గొప్ప గౌరవంగా భావిస్తా. చాలామంది నన్ను అదృష్టవంతుడివి అంటుంటారు. నీ ఆట కోసం ఎదురుచూస్తుంటారని చెబుతూ ఉంటారు. అవి విని నేను చాలా ఎంజాయ్ చేస్తా… ’ అంటూ తాజాగా చెప్పుకొచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News