Mouth Ulcer : నోటిపూత.. చాలా మంది ఈ సమస్యను ఎదుర్కుంటున్నారు. నోటిపూత బాధ వర్ణనాతీతం. ఈ నోటి పూత ఉంటే తినడం చాలా కష్టంగా ఉంటుంది. ఏది తిన్నా నోరు మండుతుంది. ఇలాంటి నోటి అల్సర్లకు మన వంటగదిలో ఉండే కొన్ని ఆహార పదార్థాలతో చెక్ పెట్టవచ్చు. అవి ఏమిటో చూద్దాం.
- అందరి ఇండ్లలో ఇంటి ముందే ఉండే తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వివిధ రకాల అలర్జీలు మరియు ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. అందుకే తులసి ఆకులను రోజుకు నాలుగైదు సార్లు నమిలితే నోటి అల్సర్లకు చెక్ పెట్టవచ్చు. తులసి ఆకులను నమిలేటప్పుడు కొంచెం నీరు తీసుకుంటే, ఆకుల రసం నోటికి వ్యాపించి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.
- కొత్తిమీరలో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి మంటను తగ్గిస్తాయి. నోటిపూత వల్ల వచ్చే నొప్పిని తగ్గిస్తాయి. కొత్తిమీర ఆకులను వేడి నీటిలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ రసంతో రోజుకు మూడుసార్లు పుక్కిలిస్తే సమస్య తగ్గుతుంది.
- ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ గుణాలు నోటిపూతలను తగ్గిస్తాయి. పుండు మీద చిన్న ఉల్లిపాయ ముక్క ఉంచిన ఫలితం ఉంటుంది.
- నోటి అల్సర్లను తగ్గించడంలో తేనె బాగా పనిచేస్తుంది. అల్సర్ కారణంగా నోరు పొడిబారడం జరుగుతుంది. అదే తేనె రాసుకుంటే నోరు తేమగా మారి ఉపశమనం పొందుతుంది. తేనెలో ఉండే యాంటీమైక్రోబయల్ గుణాల వల్ల అల్సర్ కు కారణమయ్యే బ్యాక్టీరియా త్వరగా నాశనమవుతుంది. ఫలితం వేగంగా ఉండాలంటే తేనెతో పాటు కొద్దిగా పసుపు కలుపుకోవచ్చు.
- కొబ్బరినూనెను నోటిలోని పుండ్లకు రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఎండు కొబ్బరిని నమలడం కూడా ప్రభావవంతంగా ఉంటుంది. కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గి అల్సర్ సమస్య తగ్గుతుంది.
- ఒక చెంచా గసగసాల పొడిని ఒక చెంచా పంచదారతో కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి. దీంతో అల్సర్ సమస్య తగ్గుతుంది.
- నోటిపూత నుండి తక్షణ ఉపశమనం కోసం ఐస్ క్యూబ్స్‌తో మసాజ్ చేయండి.
- లవంగాలను క్రమం తప్పకుండా నమలడం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది.
- తరచుగా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఒకే బ్రష్ ఎక్కువ కాలం వాడినా ఈ సమస్య వస్తుంది. అందుకే ప్రతి మూడు నెలలకోసారి టూత్ బ్రష్ మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
- విటమిన్ బి12 తక్కువగా ఉన్నా ఈ సమస్య వస్తుంది. కాబట్టి వైద్యుల సూచనల మేరకు బి12 విటమిన్ మాత్రలు వాడితే సమస్య పరిష్కారమవుతుంది.
- నోటిపూతతో బాధపడుతున్నప్పుడు టీ, కాఫీలకు దూరంగా ఉండటం మంచిది.
read more health news :
health benefits of beans | బీన్స్ తింటే చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు..
heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..
-Advertisement-