Homemoral stories in teluguMoral Stories in Telugu : గాడిద - యజమాని

Moral Stories in Telugu : గాడిద – యజమాని

Telugu Flash News

Moral Stories in Telugu : ఒకరోజు ఒకతను తన కొడుకును, గాడిదను తీసుకుని బజారుకు వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉండగా ఒక పెద్ద మనిషి వీరిని చూసి “అదేంటయ్యా ! అంత గాడిదను పెట్టుకొని నడుస్తూ పోతున్నారు ? అని అడిగాడు.

నిజమే కదా అనుకొని “బాబూ నువ్వు ఎక్కు” అని తండ్రి, కొడుకుని గాడిదపై కూర్చోబెట్టి, తన నడుస్తూ వెళుతున్నాడు. ఇంకొంత దూరం పోయాక మరో పెద్ద మనిషి వీళ్ళని ఆపి ఏం కొడుకువయ్యా ! పెద్దవాడైన తండ్రిని నడిపిస్తూ నువ్వు సుఖంగా గాడిదెక్కి పోతున్నావా? అన్నాడు.

దాంతో, కొడుకు దిగిపోయి తండ్రిని గాడిదపై కూర్చో పెట్టాడు. అలా ఇంకొంత దూరంపోయాక ఇంకో మనిషి వీళ్ళని ఆపి “అసలేం తండ్రివయ్యా నువ్వు ? చిన్నవాణ్ణి నడిపిస్తూ నువ్వుగాడిదెక్కి ఊరేగుతావా ?” అన్నాడు.

అది విని కొడుకు కూడా గాడిదపైకి ఎక్కి కూర్చున్నాడు. అలా కాస్త దూరం వెళ్ళారో … లేదో. ఇంకొక అతను వీళ్ళని చూసి “ఛ ! ఛ ! మీ కసలు దయ, జాలి ఉన్నాయా ? మీరే గాడిదల్లా పెరిగి పాపం నోరులేని జీవంపై కూర్చుంటారా ?” అన్నాడు.

ఇదెక్కడి గొడవరా బాబూ అనుకొని, తండ్రీ కొడుకులిద్దరూ దిగి, గాడిదను భుజాల మీద ఎత్తుకొని నడవసాగారు. అది చూసి దారిన పోయే వాళ్ళందరూ గట్టిగా నవ్వడం మొదలు పెట్టారు. దాంతో గాడిద కంగారు పడి పారిపోయింది.

అందరినీ మెప్పించడం చాలా కష్టమైన పని అని అప్పటికి తెలిసింది వాళ్ళకు.

-Advertisement-

తమకు తోచింది తాము చేయాలి గానీ ఇతరులకు నచ్చే విధంగా చేయాలనుకోవటం వలన అసలు ఏమి చేయాలో తెలియని అయోమయంలో పడిపోతామని అర్థమయింది.

అప్పటి నుంచీ ఆ విధంగానే జీవనం గడపటం అలవరచు కున్నారు.

నీతి : ప్రతివారు చెప్పిన మాటలను విశ్వసించకూడదు.

also read news:

Ananya Panday latest hot instagram photos 2022

bhumi pednekar latest instagram photos 2022

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News