moral stories in telugu : పిల్లలూ.. ఈ రోజు ఒక స్కూల్ లో చదివే ఇద్దరు బాయ్స్ కథ చెప్పుకుందాం.. ఒకరు రాము, ఇంకొకరు సోము..
ఒక ఊరిలో రాము అనే కుర్రాడు ఉన్నాడు, స్కూల్ గేమ్స్ లో ఎప్పుడూ ఫస్ట్ వస్తాడు, స్కూల్లో టీచర్లందరికీ అతనంటే చాలా ఇష్టం. రాము క్లాసులో సోము అనే మరో కుర్రాడు ఉన్నాడు రాముని చూస్తే చాలా అసూయపడుతాడు. రాముడిని ఏదో విధంగా దెబ్బతీయాలని సోము నిర్ణయించుకున్నాడు.
ఒకరోజు సాయంత్రం అందరూ ఆడుకుంటున్నప్పుడు ఎవరికీ తెలియకుండా రాము స్కూల్ బ్యాగ్ ను సోము చెట్టుపైన దాచిపెడతాడు . ఆడుకున్న తర్వాత రాము తన స్కూల్ బ్యాగ్ కోసం చాలా వెతికాడు కానీ దొరకలేదు. అతను చాలా విచారంగా ఇంటికి వెళ్లి, మరో రెండు రోజుల్లో పుస్తకాలు మరియు పరీక్షలు లేకుండా ఎలా చదువుకోవాలి అని ఆలోచించాడు.
పరీక్షలన్నీ అయిపోయాక, ఎప్పటిలాగే పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ వచ్చిన రాము ని చూసి సోము చాలా ఆశ్చర్యపోయాడు. వాడు రాము దగ్గరకు వెళ్లి నీ స్కూల్ బ్యాగ్ పోయింది కదా .. మరి నీకు ఫస్ట్ క్లాస్ మార్కులు ఎలా వచ్చాయి అని రాము ని అడిగాడు. అవును పుస్తకాలు లేవు కానీ నాకు క్లాసులో చెప్పిన పాఠాలన్నీ గుర్తుంటాయి అని రాము అన్నాడు. అది విన్న సోము తన ప్రవర్తనకు సిగ్గుపడ్డాడు.
చెట్టు పైన దాచి పెట్టిన రాము స్కూల్ బ్యాగ్ ని తిరిగి తెచ్చి ఇచ్చాడు సోము . ఇంకా రాము ని క్షమించమని అడిగాడు. పాఠాలు సరిగ్గా విని , రోజూ చదువుకోవడం అలవాటు చేసుకుంటే తను కూడా ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవచ్చని నిర్ణయించుకుంటాడు.
నీతి : కష్టపడి చదువుకోవాలి.. విజయం మనదే..
read more moral stories :
moral stories in telugu : నిన్ను నీవు నిందించుకోకు..
moral stories in telugu : అబద్ధం ఆడరాదు.. ఆడితే నష్టం తప్పదు