moral stories in telugu : ఒక అడవిలో ఒక కుందేలు, ఒక తాబేలు ఉండేవి. కుందేలుకు తాను చాలా అందంగా ఉంటానని, ఎక్కువ వేగంగా పరిగెత్తగలనని గర్వపడుతూ ఉండేది. ఒక రోజు కుందేలు అడవిలో తిరుగు తుంటే దానికి నెమ్మదిగా నడుస్తూ వెళుతున్న తాబేలు కనిపించింది. కుందేలు తాబేలు రూపాన్ని చూసి అసహ్యించుకుంది.
అప్పుడు తాబేలుతో “తాబేలా! దేవుడు నిన్ను చాలా వికృతంగా పుట్టించాడు. చూడటానికి చాలా అందవిహీనంగా ఉన్నావు. దానికి తోడు నీ నడక ఒకటి. ఇదుగో అంటే ఆర్నెల్లులా ఉంది నీ నడక. నాతో పందెం కాస్తావా” అన్నది. కుందేలు మాటలకు తాబేలుకు బాధ కలిగింది. కుందేలుతో పోటీకి సరే అన్నది.
అక్కడ దూరంగా కనిపిస్తున్న మర్రిచెట్టు దగ్గరికి ఎవరు ముందు వెళితే వారే గెలిచినట్టు అంది. కుందేలు, తాబేలు రెండూ బయలు దేరాయి. కుందేలు మెల్లగా నడుచుకుంటూ టే, కుందేలు చెంగు చెంగున ఎగురుతూ ముందుగా వెళ్ళి మలుపు దగ్గర ఆగి వెనక్కు చూసింది. కనుచూపు మేర తాబేలు కనిపించలేదు.
ఆ తాబేలు గెలిచినప్పుడు కదా. అది కనిపించగా నేను ఒక్క చెంగున ఆ మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళవచ్చు అని మర్రిచెట్టు సమీపంలో ఉన్న ఒక చెట్టు క్రింద విశ్రాంతిగా కూర్చుంది. మెల్లగా నిద్రలోకి జారుకుంది. మంచి నిద్రపట్టింది. కొంతసేపటి తరువాత దానికి మెలకువ వచ్చి వెంటనే ఒక్క ఉదుటున మర్రిచెట్టు దగ్గరకు చేరింది.
అది అక్కడకు చేరుకునేసరికి తాబేలు అక్కడకు వచ్చి ఉన్నది. కుందేలు సిగ్గుపడింది. దాని అహకారం, గర్వం రెండూ అణిగిపోయాయి. తాబేలును అవమా నించినందుకు క్షమాపణ చెప్పుకుంది. తాబేలు గర్వం లేకుం వ్యవహరించింది కనుక దైవ సహాయం దానికి లభించింది.
నీతి : గర్వం ఉన్నవారు ఎంత సమర్థులైనా ఎప్పుడో ఒకప్పుడు అవమానం జరగక తప్పదు.
also read :
Viral Video : వధూవరులను వీడియో తీస్తూ డ్రెయినేజీలో పడిపోయిన మహిళ!
Shiva Jyothi: శివ జ్యోతి పేరుతో పెద్ద మోసం.. లబోదిబోమంటున్న బాధితుడు
Horoscope (02-03-2023) : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?