moral stories in telugu : ప్రతిరోజు తెల్లవారేముందు ఒకానొక గురుశిష్యులు కలసి నడక వ్యాయామం మంచిదని వెళ్లేవారు. రోజులాగే వెళుతుండగా గురువుగారు దగ్గరగానున్న నాలుగు మొక్కలను చూడడం జరిగింది. ఆ నాలుగు మొక్కలు కూడా ఒకటిగా లేవు. అంటే ఒకటి అపుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క, రెండవది దానికంటే కొంచెం పెద్దది, మూడవది దానికన్న ఇంకా కొంచెం పెద్దది, నాల్గవది పెద్దదే. శిష్యులను పిలిచి “ఈ నాలుగు మొక్కల్లో దాగియున్న నీతి ఏమిటో తెలుసా!” అని అడిగారు వారి ఊహలకు అందలేదా నీతి. సరే అందరూ గమనిస్తుండండి. మీలో ఒకరు వచ్చి నేను చెప్పినట్లు చేయండి. మిగిలిన వారు బాగా గమనిస్తూ ఉండండి. మధ్యలో మాట్లాడవద్దని ఆ గురువు గారు చెప్పారు.
శిష్యులలో ఒక శిష్యున్ని పిలిచి మొదటి మొక్కను చూపుతూ ఈ మొక్కను భూమి నుండి లాగేయమన్నారు. తేలికగా ఆ మొక్కను లాగేసినాడా శిష్యుడు.
అలాగే రెండో మొక్కను కూడా లాగేయమన్నాడు. కొంచెం కష్టముతో ఆ మొక్కను కూడా లాగి వేశాడు. మరీ ఈ మూడవ మొక్కను కూడా అలాగే లాగగలవా! అని గురువుగారు అడుగగా అలాగే గురుజీ అని అనగా, “అయితే సరే భూమి నుంచి లాగేయ్ అని అనడంతోనే ఆ శిష్యుడు తన శక్తినంతా ఉపయోగించి అత్యంత కష్టముగా ఆ మూడవ మొక్కను కూడా లాగేసినాడు.
నాల్గవ మొక్క చాలా పెద్దగా బలిష్ఠంగా ఉంది. దీనిని చూపుతూ “దీన్ని కూడా వాటిలాగే భూమినుండి లాగేయ్” అని అన్నారా గురువుగారు. శిష్యుడు ఎంత ప్రయత్నించినా, శతవిధాలా ప్రయత్నము చేసినా, అనేక రకాల సాహసాలను చేసినా రకరకాల విచిత్ర పోకడలు పోయినా ఆ మొక్కను కదలించలేకపోయినాడు.
అయినా మొండి పట్టుదలగల ఆ శిష్యుని ప్రయత్నానికి అబ్బురపడి చూడు నాయనా! నిత్య జీవితములో మనకు తెలిసి తెలియని కొన్ని అలవాట్ల విషయంలో జరుగుతుంటుంది. చెడు అలవాట్లు కూడా ఇలాగే పాతపడిపోతే వాటిని మార్చుకోవడం ఎవరి తరం కాదు. ఈ నాల్గవ మొక్కలాగే ఉంటుంది. మొక్కై వంగనిది మానై వంగునా ! చిన్న వయస్సు లోనే చెడు అలవాట్లను గమనించి మొక్కలను భూమి నుండి లాగేసినట్లుగా మననుండి కూడా వేరు చేస్తే ఫలితం బాగుంటుంది. మనిషిలోని చెడు భావాల్ని గుణాల్ని పారద్రోలాలి అని చెప్పాడు.
నీతి : మనలో పెరిగే చెడుఅలవాట్లను చిన్న మొక్కగా ఉన్నప్పుడే లాగేయ్యాలి.
also read:
Immunity Foods : రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలా.. ఈ ఫుడ్స్ తింటే తిరుగుండదు!
ICC: మ్యాచ్‌లు ఆడకుండానే టాప్ ర్యాంక్‌లో నిలిచిన టీమిండియా.. ఐసీసీకి నెటిజన్ల చురకలు
Viral video : రోడ్డుపై బైక్‌లో కపుల్ రొమాన్స్.. సోషల్ మీడియాలో వైరల్