Homemoral stories in teluguMoral Stories in telugu : కప్ప రాకుమారుడు

Moral Stories in telugu : కప్ప రాకుమారుడు

Telugu Flash News

Moral Stories in telugu : ఒక రాజుకు అందమైన కూతురు ఉండేది. వారి రాజ భవనం పరిసరాల్లో ఒక అడవి, దానిలో ఒక బావి ఉండేది. ప్రతిరోజూ బుజ్జి యువరాణి ఆ బావి పక్కన కూర్చుని ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమె ఆడుకుంటూ ఉండగా బంతి ఆ లోతైన బావిలో పడిపోయింది.

“అయ్యో నా అందమైన బంతి” అంటూ ఏడ్చిందా యువరాణి.

“ఏమయింది యువరాణీ ?” అని బావిలో నుంచి ఒక స్వరం వినిపించింది. బావిలోకి తొంగిచూసిన అమ్మాయికి ఒక కప్ప కనిపించింది.

“నా బంతి బావిలో పడిపోయింది” ఏడుస్తూ చెప్పింది యువరాణి.

“ఏడవకు” అంది కప్ప.

“నేను నీ బంతిని తీసిస్తాను. మరి బదులుగా నువ్వు నా కేమిస్తావు ?” అని అడిగింది.

-Advertisement-

“నీకేం కావాలి ? నాదుస్తులా ? నా అభరణాలా ? నా బంగారు కిరీటమా ?” అని అడిగింది యువరాణి.

“అవేవీ కావు ! నన్ను నీ స్నేహితుడిలా చూసుకుంటే చాలు. నన్ను నీ టేబుల్ పై కూర్చోనివ్వాలి. నీ బంగారు పళ్ళెంలో తిననివ్వాలి. నీ బంగారు గ్లాసులో తాగనివ్వాలి. అప్పుడే నేను నీకు అందమైన బంతిని తెచ్చిస్తాను” అంది కప్ప.

“సరే ! నేనన్నింటికి ఒప్పుకుంటున్నాను” అంది యువరాణి.

కప్ప ఒక్క ఉదుటున నీటిలోకి దూకి బంతిని పైకి తెచ్చింది.

అంతే, యువరాణి గబుక్కున బంతిని లాక్కుని కనీసం “కృతజ్ఞతలు” కూడా చెప్పకుండా ఇంట్లోకి పరుగెట్టింది.

“ఆగు ఆగు” అని అరిచింది కప్ప.

కాని యువరాణి వినకుండా పరుగెత్తడంతో కప్ప చేసేదేమీ లేక బావిలోకి జారుకుంది.

మరునాడు యువరాణి నిద్ర లేచి బయటకు వస్తుంటే గుమ్మం దగ్గర ఆ కప్ప కనబడింది. ఆ కప్పను చూడగానే యువరాణి తలుపు మూసి తండ్రి దగ్గరకు పరుగెత్తింది.

“ఏమయింది తల్లీ !” అని అడిగాడు రాజు.

జరిగిన విషయం తండ్రితో వివరించి చెప్పింది యువరాణి.

ఇచ్చిన మాట

“ఎలాంటి పరిస్థితులలోనైనా  నిలబెట్టుకోవాలి. ఇంట్లోకి రానివ్వు” అన్నాడు రాజు.

యువరాణి తలుపు తెరవగానే, కప్ప నేరుగా భోజనాల బల్ల దగ్గరకు వెళ్ళి కుర్చీపైకి ఎక్కింది.

“నన్ను నువ్వుపైకి తీసుకో. నేను బంగారు పళ్ళెంలో భుజించాలి” అని యువరాణితో అంది కప్ప.

యువరాణి బంగారు పళ్ళెం చేత్తో పట్టుకొని కప్పను ముట్టు కోగానే అది ఒక అందమైన అబ్బాయిగా మారిపోయింది.

“నేను ఒక రాకుమారుడిని. ఒక దుర్మార్గపు మంత్రగత్తె నన్ను కప్పలా మార్చింది. ఒక రాకుమార్తె స్పర్శ తిరిగి నన్ను రాకుమారుడిగా మారుస్తుందని ఆ మంత్రగత్తె చెప్పింది” అన్నాడు కప్పరూపం నుండి మనిషిగా మారిన ఆ రాకుమారుడు.

అది విని రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత రాకుమారుడిని తమ దగ్గరే ఉండమని కోరాడు రాజు. అతను ఒప్పుకున్నాడు.

తనకు కొడుకులు లేని లోటు తీరినందుకు రాజు అన్న దొరికినందుకు యువరాణి ఎంతగానో సంతోషించారు.

నీతి : ఇతరులకు సహాయం చేస్తే మనకు తప్పక మేలు జరుగుతుంది.

also read news:

Shriya Saran Latest hot Photoshoot Instagram pics 2022

Special Stories : భయపెట్టే పర్యాటక ప్రదేశం.. అది ఎక్కడుంది? అక్కడ ఎవరు చనిపోయారు?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News