moral stories in telugu : ఒక ఊరిలో ఒక కోపిష్టి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఎదుటివారిపై అకారణంగా కోపం వచ్చేది. ఒకసారి అతను బుద్ధుని దగ్గరకు వెళ్ళటం జరిగింది. కొంతసేపు బుద్ధుని కోసం వేచి ఉండాల్సిరావటంతో బ్రాహ్మణునికి చాలా కోపం వచ్చింది. వివేకాన్ని కోల్పోయాడు.
బుద్ధుడిని చూడగానే తిట్ల దండకం మొదలెట్టాడు.
నోటికి వచ్చిన మాటలతో బుద్ధుణ్ణి దూషించసాగాడు ఆ బ్రాహ్మణుడు. బుద్ధుడు మౌనంగా కూర్చుని ఉన్నాడు.
అతని ముఖంలో ఎటువంటి మార్పులు కలగలేదు. చాలా ప్రశాంతంగా ఉన్నాడు.
ఆయనలో చలనం లేకపోవటం చూసి బ్రాహ్మణుడు ఒకప్రక్క ఆశ్చర్యపోతూనే మరో పక్క తిట్టసాగాడు.
బుద్ధుడి ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరలేదు – చివరకు అలిసిపోయిన బ్రాహ్మణుడు చాలా సేపటి నుంచీ నేను నీ ముందు నిలబడి ఉన్నాను. ఇన్ని తిట్లు తిడుతున్నాను. నీకు ఏమీ అనిపించడం లేదా ?” అని అడిగాడు.
“ప్రియమైన సోదరా ! నీ నుండీ నేను ఒక్క తిట్టు కూడా స్వీకరించలేదు” అన్నాడు బుద్ధుడు అదే చిరునవ్వుతో.
“కానీ నువ్వు నా తిట్లను విన్నావుగా !” బ్రాహ్మణుడు వాదించటం మొదలుపెట్టాడు.
“నాకు తిట్ల అవసరం లేనప్పుడు నేనెందుకు వాటిని వింటాను ? అన్నాడు.
“నీ మాటలకు అర్థం ఏమిటి ?” అయోమయంగా అడిగాడు బ్రాహ్మణుడు.
“ఆ తిట్లన్నీ నీ దగ్గిరే ఉండిపోయాయి” బుద్ధుడు జవాబిచ్చాడు. “ఇదెలా సాధ్యం ? తిట్లన్నీ నేను నీ మీద విసిరానుగా”. “నిజమే ! విసిరావు. కానీ నేను వాటిని స్వీకరించలేదు”.
ఆ బ్రాహ్మణుడు ఇంకా అయోమయంలో పడిపోయాడు.
“మీ ఉద్దేశం ఏమిటి ?”
“నా ప్రియమైన సోదరా ! ఒకవేళ నీవు ఎవరికైనా కొన్ని నాణాలు ఇవ్వాలనుకున్నావు. కానీ అతడు వాటిని తీసుకోలేదు.
అప్పుడు ఆ నాణాలు ఏమౌతాయి ?” బుద్ధుడు నిదానంగా అడిగాడు.
“అవి నావి కాబట్టి సహజంగా నాకే మిగిలిపోతాయి”
బుద్ధుడు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వాడు.
“నిజం చెప్పావు. నిజంగా నీ తిట్ల విషయంలో కూడా అదే జరిగింది. నువ్వు నా మీద తిట్లని విసిరేశావు. కానీ నేను వాటిని నేను తిరస్కరించాను. కాబట్టి ఆ తిట్లు నీ దగ్గరే మిగిలిపోయాయి. అవునా ? ! మరి నాకు కోపం ఎందుకు వస్తుంది?” బ్రాహ్మణుడు వెంటనే తన ప్రవర్తన పట్ల సిగ్గుతో తలవంచుకున్నాడు.
బుద్ధుని పాదాలపై పడి క్షమించమని కోరాడు.
నీతి : తొందరపడి ఇతరులను నిందించకూడదు.
also read news:
corona effect : సెన్సెక్స్ భారీ లాస్.. కరోనా భయంతో ఇన్వెస్టర్ల బెంబేలు.. వేల కోట్ల సంపద ఆవిరి!