Telugu Flash News

Moral Stories in Telugu : అందమైన దస్తూరి

Moral Stories in Telugu : చాలా కాలం క్రితం మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామంలో బాలాజీ అనే కుర్రవాడు ఉండేవాడు. బీదవాళ్ళయినా అతని తల్లిదండ్రులు బాలాజీని పాఠశాలకు పంపేవారు.

బాలాజీ చాలా కష్టపడి చదివేవాడు. అయితే అతనికి కొంచెం మతిమరుపు ఉండేది. ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువగా మరిచి పోయేవాడు. తన స్థితికి బాలాజీ చాలా బాధపడేవాడు. తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేస్తున్నానని చింతించేవాడు.

బాలాజీది చాలా అందమైన దస్తూరి. అక్షరాలను ఎంతో పొందికగా ముత్యాలులా రాసేవాడు. దీనికి జ్ఞాపకశక్తి అవసరం లేదు కదా. అతడు తన దస్తూరీ ఇంకా మెరుగుపరుచుకోవడానికి కష్టపడేవాడు. రాను రాను అతని చేతిరాత ఎంతో అందంగా తయారైంది.

ఆ సమయంలో మహారాష్ట్రను ఛత్రపతి శివాజీ పాలిస్తు న్నాడు. ఆ కాలంలో అచ్చుయంత్రాలు లేవు. అందుకే ప్రతీదీ చివరకు పుస్తకాలు కూడా చేతితోనే రాయాల్సి వచ్చేది.

దీని కోసం కొలువులో ప్రత్యేకించి కొందరిని నియమించేవారు. శాస నాలు, అధికారపత్రాలు, ఉత్తరాలు మొదలైన వ్యక్తిగత ప్రతులు రాయడానికి శివాజీకి ఒక వ్యక్తి కావల్సి వచ్చింది.

ప్రస్తుతం కొలువులో ఒక వ్యక్తి ఉన్నాడు. కాని శివాజీకి ఇంకా అందంగా రాయగలిగే వాడు కావాలనుకున్నాడు. మంచి దస్తూరి కల వ్యక్తి కోసం వెదకమని ప్రధానమంత్రితో చెప్పాడు శివాజి.

ప్రధానమంత్రి రాజ్యమంతా సంచరించి ఎందరివో దస్తూరీలు సేకరించారు. వాటిలో చాలా బాగున్నవి ఏడు ఎంపిక చేసి శివాజీకి సమర్పించాడు.

శివాజీ వాటిలో ఒక దస్తూరీని చూడ గానే ఎంతో ముచ్చట వేసింది. వెంటనే ఆ వ్యక్తిని నియమించమని చెప్పాడు. అతనే బాలాజీ.

శివాజీకి వ్యక్తిగత లేఖకుడిగా బాలాజీ నియమించబడ్డాడు. అందమైన దస్తూరీ వల్ల అన్నీ లాభాలే !

నీతి : కొన్ని విషయాలలో వెనకబడి ఉన్నామని దిగులు పడకుండా, ఇంకా బాగా నేర్చుకోవాలని సాధన చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.

also read news:

Lionel Messi : అర్జెంటీనాకు వ‌ర‌ల్డ్‌క‌ప్ అందించిన సూప‌ర్‌హీరో మెస్సీ గురించి తెలుసుకుందామా ? మెస్సీ లైఫ్ స్టోరీ !

Acidity : చలికాలంలో ఎసిడిటీ బాధిస్తోందా? ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి!

 

Exit mobile version