moral stories in telugu : ఒక నది ఒడ్డున ఉన్న ఒకానొక మర్రిచెట్టుపై పావురములు, కాకులు నివసిస్తుండేవి. ఒక రోజు తిరిగి తిరిగి వచ్చి చెట్టుకొమ్మపై ఒక పావురము తన పరిసరాలను గమనిస్తూ ప్రకృతిని చూచి ఆనందిస్తూ ఉంటున్న సమయంలో క్రిందకు చూడగా ఒక చీమ నదిలో కొట్టుకొని పోతుండడం చూచి “ఈ చీమను నేను ఎలాగైనా బ్రతికించాలి” అని అనుకొని మర్రి ఆకును తెంచి ఆ చీమకు అందుబాటుగా ఉండేటట్లు వేసింది. అపుడు ఆ చీమ ఆ ఆకుపైకి వచ్చి మెల్లగా ఒడ్డుకు చేరుకోగలిగింది. తర్వాత పావురము వల్ల బ్రతికినందుకు కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నది.
తర్వాత కొద్దిరోజులకు చీమ అటుగా వస్తున్న సమయంలో వేటగాడు విల్లమ్ములతో అటుగా వస్తూ పావురాన్ని చంపే ప్రయత్నంగా గురికై ప్రయత్నం చేయుటను గమనించింది. “ఆ పావురం వల్ల కదా నేను ఈనాడు బ్రతికి జీవించగల్గుతున్నాను. ఆ పావురమే సహాయం చేసి ఉండకపోతే నేను ఏమై ఉండేదాన్ని” అని ఒక్కసారి ఆలోచించి ఆ పావురాన్ని ఎలాగైనా సరే రక్షించి తీరాలి అని నిర్ణయించుకుంది.
వేటగాడు మాత్రం చెట్టు వెనుక దాక్కొని ఆ పావురం పైకి ఆ బాణంను ఎక్కుపెట్టి వదలడానికి సిద్ధమవుతుండడాన్ని ఈ చీమ గమనించింది. ఆలస్యం చేయకుండా చీమ పరుగు పరుగున వేటగాడిని సమీపించి బాణం వదిలే సమయాన్ని గమనించి చీమ ఆ వేటగాణ్ని కుట్టింది. కుట్టడం వల్ల గురితప్పి పావురం ప్రక్కనుంచి దూసుకుపోయింది. వెంటనే పావురం కూడా ఆ స్థలం నుండి ఎగిరిపోతూ సహాయం చేసిన ఆ చీమను గుర్తించి కృతజ్ఞతలు తెలుపుకుంది.
నీతి : చేసిన సహాయం ఎప్పుడూ వృధాకాదు. అందుకే ఇతరులకు సహాయం చేసే ప్రయత్నం తప్పక చేయాలి.
also read :
Anasuya: అనసూయ ‘ఆంటీ’ పై నటి కస్తూరి వివరణ.. అది డర్టీ మీనింగ్ అంటూ కామెంట్
Samantha : చైతూ వలన సమంత ఇంకా ఇబ్బంది పడుతుందా?