moral stories in telugu : ఒక గ్రామంలో దేవశర్మ అనే సన్యాసి ఉండేవాడు. ఆయన ఆశ్రమం నిర్మించుకుని తనను చూడటానికి వచ్చే జనాలకు మంచీ, చెడ్డా బోధించేవాడు. ఒకసారి ఆయన దేవుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు.
దేవశర్మ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు దేవశర్మ “పరమేశా ! చాలా రోజుల నుంచి నాకెందుకో అశాంతిగా అనిపిస్తోంది. నా అశాంతిని పోగొట్టుకోవడానికి తపస్సు చేశాను. నిజానికి నాకు కోరిక లేద లేవు. అయితే నేను ఒక ప్రశ్నకు సమాధానం తెలుసు కోవాలను కుంటున్నాను. మా మానవుల పట్ల నీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి ?” అని అడిగాడు.
శివుడు ఒక్కక్షణం ఆలోచించి ఇలా చెప్పాడు. పిల్లలుగా ఉన్నప్పుడు త్వరగా పెద్దవాళ్ళయిపోవాలని ఆరాటపడతారు. పెద్దవాళ్ళయ్యాక తిరిగి పిల్లలుగా ఉండాలని అనుకుంటారు.
ఆ డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని కోల్పోతారు. తిరిగి ఆరోగ్యాన్ని పొందడానికి డబ్బు కోల్పోతారు.
భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ వర్తమానాన్ని మరిచిపోతారు. ఆ విధంగా వర్తమానాన్ని ప్రశాంతంగా అనుభవించరు.
ఈ జీవితం శాశ్వతమనుకుని జీవితాంతం అహంకారంతోనే బ్రతుకుతారు. చనిపోయేటప్పుడు అంతకు ముందు ఎప్పుడూ జీవించలేదని అనుకుంటారు.
“దేవాదేవా ! నేను ఏం తెలుసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు.” అని అడిగాడు దేవశర్మ.
“నీకు నన్నెవరూ ప్రేమించరు అనిపించినప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని గుర్తుంచుకోవాలి.
ఈ ప్రపంచంలో నీకెవరూ లేరని ఒంటరిగా అనిపించి నప్పుడు నీతో నేనున్నానని గ్రహించాలి. ధనవంతుడంటే చాలా ధనం ఉండటం కాదని, అతి తక్కువగా అవసరాలను కలిగి ఉండట మేనని తెలుసుకోవాలి. ఎదుటివారు మనదారిలోనే నడవాలని ఆశించకూడదు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు ఒకేవైపు చూడ గలరు కానీ ఆ వస్తువును చూసే కోణం మారుతుందని గ్రహిం చాలి. ఇతరులు తమని క్షమించటం సరిపోదు. ప్రతివ్యక్తి తమని తాము క్షమించుకోగలగాలి” అని చిరునవ్వుతో చెప్పాడు శివుడు.
ఆ మాటలు విన్న దేవశర్మకు ఎంతో స్వాంతన చేకూరగా శివుడిని పరిపరి విధాల స్తుతించి ఆశ్రమానికి తిరిగి వచ్చి దేవుని మాటలు ఆచరిస్తూ, వాటినే అందరికీ తెలియజేస్తూ శేషజీవితాన్ని సార్థకం చేసుకున్నాడు.
నీతి : దిక్కులేని వా వారికి దేవుడే దిక్కు. తనకు ఎవ్వరు లేరనుకొన్నప్పుడు దేవుడు తనతో ఉన్నాడుకోవాలి.
also read news:
DK Aruna on Kavitha : తప్పు చేయకపోతే భయమెందుకు? కవితపై డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!
masala poori : మసాలా పూరీ.. కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది!