Homeviral newsViral Video: కోతి దొంగ‌తనం.. బ్యాగ్ జిప్ తెర‌చి మ‌రీ..

Viral Video: కోతి దొంగ‌తనం.. బ్యాగ్ జిప్ తెర‌చి మ‌రీ..

Telugu Flash News

Viral Video: భూమి మీద ఉన్న తెలివైన జంతువుల‌లో వాన‌రం జాతి తొలి స్థానంలో ఉంటుంది. కోతులు..ఆహారం కోసం ప్ర‌ద‌ర్శించే తెలివితేట‌లు అందరికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంటాయి. అవి తినుబండారాలే కాకుండా ఒక్కోసారి వ‌స్తువుల‌ని సైతం లాక్కొని వెళ్లి నానా ఇబ్బందుల‌కి గురి చేస్తుంటాయి.

కోతులు తమకు కావాల్సిన దానికోసం ముందుగానే ప్లాన్ చేసుకుంటాయి..కరెక్ట్ టైమ్ చూసి గురిపెట్టిన వస్తువును చోరీ చేస్తుంటాయి.. ఇది రెప్పపాటులో చోరీ జరిగిపోతుంది.

కోతి చేష్ట‌లు..

తాజా వీడియోలోని కోతి ఓ వ్యక్తి బ్యాగ్ నుంచి ఆహారాన్ని చాక‌చ‌క్యంగా దొంగిలించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. వీడియోలో ఓ వ్య‌క్తి బ్యాగ్ త‌గిలించుకొని కూర్చొని ఉన్నాడు. కోతి మెల్ల‌గా బ్యాగ్ దగ్గరకు వెళ్లి జిప్ ఓపెన్ చేసింది. బ్యాగ్ లోపల చెయ్యి పెట్టి యాపిల్ బయటకు తీసి, దానిని తీసుకుని పారిపోయింది.

ఆ కోతి చేష్టలను పక్కనే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో కొద్ది క్ష‌ణాల‌లోనే వైర‌ల్ అయింది.ఈ వీడియోపై నెటిజ‌న్స్ త‌మ‌దైన శైలిలో కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

కోతులు ఇప్పుడు బాగా ఎక్కువ‌య్యాయి. ఇంట్లోకే వ‌చ్చేస్తున్నాయి. విహార యాత్రకు వెళ్లిన పర్యాటకుల నుంచి ఆహారం తీసుకెళుతున్నాయి. ఇక ఆలయాలు, పార్క్ వద్ద ఉంటే మాత్రం అక్కడినుంచి వారిని పరుగెత్తించి మరీ ప‌ట్టుకుపోతున్నాయి. బ్యాగులో చిప్స్ లేదంటే పండ్లు ఉంటే మాత్ర వదిలిపెట్టవు .

కోతులు ఉన్న ప్ర‌దేశాల‌లో మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే పని గోవిందానే. ఏదేమైన తాజాగా కోతి చేష్ట‌ల‌కు సంబంధించిన ఓ వీడియో మాత్రం అంద‌రిని తెగ ఆక‌ర్షిస్తుంది.

-Advertisement-

 

 

View this post on Instagram

 

A post shared by Waow Africa (@waowafrica)

ఇవి కూడా చదవండి :

Viral Video: పేరెంట్స్ క్యూట్ గిఫ్ట్‌.. చిన్నారి ఎక్స్‌ప్రెష‌న్స్ అదిరిపోయాయిగా..!

Viral Video: వీడు మాములోడు కాదు..బైక్‌పై తీసుకెళుతూ ప్రియురాలిని నీళ్ల‌లో ప‌డేసిన ప్రియుడు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News