Telugu Flash News

MLC Kavitha : ఎమ్మెల్సీ కవితతో వాట్సాప్‌ చాట్‌ను బయటపెట్టిన సుఖేష్‌.. కోడ్‌ లాంగ్వేజ్‌లో ఏముందంటే!

mlc kavitha

ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో చిక్కుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పై సుఖేష్‌ చంద్రశేఖర్‌ బాంబ్‌ పేల్చాడు. ఇప్పటికే మనీల్యాండరింగ్‌, చీటింగ్‌ కేసుల్లో మనీ ల్యాండరింగ్‌, చీటింగ్‌ కేసుల్లో జైలులో ఉన్న సుఖేష్‌.. తాజాగా ఎమ్మెల్సీ కవితతో చాటింగ్‌ చేసినట్లుగా చెబుతూ ఓ లేఖను విడుదల చేశాడు. 20 పేజీలున్న ఈ లేఖలో కీలక విషయాలు వెల్లడించాడు.

తన న్యాయవాది ద్వారా ఈ లేఖను సుఖేష్‌ విడుదల చేశాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌, మాజీ మంత్రి సత్యేంద్రజైన్‌ ఆదేశాలతోనే హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో రూ.15 కోట్లు ఇచ్చినట్లు ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఎమ్మెల్సీ కవిత పేరును కవిత అక్క టీఆర్ఎస్ అని తన ఫోన్లో సుఖేష్‌ సేవ్‌ చేసుకున్నాడు.

వాట్సాప్‌ చాటింగ్‌లో భాగంగా తరచూ తెలుగులో కూడా వీరు మాట్లాడుకోవడం విశేషం. ఎమ్మెల్సీ కవితతో చాటింగ్‌, ఎవరి ఆదేశాల మేరకు డబ్బులు ఎక్కడెక్కడికి పంపించాలి లాంటి వివరాలను సుఖేష్‌ వెల్లడించాడు. ఈ మేరకు వివరాలు తీసుకొని లోతైన దర్యాప్తు జరపాలని సీజేఐకి, కేంద్ర హోంమంత్రికి, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు, సీబీఐ డైరెక్టర్‌కు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు అందజేశాడు.

ఎమ్మెల్సీ కవితకు, తనకు మధ్య జరిగిన వాట్సాప్‌ చాటింగ్‌లో భాగంగా కోడ్‌ ల్యాంగ్వేజ్‌ యూస్‌ చేసినట్లు సుఖేష్‌ పేర్కొన్నాడు. అర్వింద్‌ కేజ్రీవాల్‌ అంటే ఏకే అని, ఎస్‌జే అంటే సత్యేంద్ర జైన్‌, మనీష్‌ సిసోడియా పేరును మనీష్‌ అని, అరుణ్‌ పిళ్లై పేరును అరుణ్‌ అని కోడ్‌ ల్యాంగ్వేజ్‌లో పిలుచుకున్నారు. జేహెచ్‌ అంటే జూబ్లీహిల్స్‌ అని, ఆఫీస్‌ అంటే టీఆర్ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం అని సెట్‌ చేసుకున్నామన్నాడు.

ప్యాకేజీ అంటే 15 కోట్ల రూపాయలని సుఖేష్‌ వివరించాడు. ఇక సత్యేంద్ర జైన్‌ను బ్రో అని, 15 కేజీల నెయ్యి అంటే 15 కోట్ల నగదు అని చెప్పుకున్నామన్నాడు. 25 కేజీల నెయ్యి అంటే 25 కోట్ల రూపాయలని, సిస్టర్‌ అంటే ఎమ్మెల్సీ కవితగా, అర్వింద్‌ కేజ్రీవాల్‌ను ఏకే భాయ్‌గా కోడ్‌ భాష ఉపయోగించినట్లు పేర్కొన్నాడు. ఇక ఈ వాట్సాప్‌ చాటింగ్‌ రివీల్‌ అంశం బీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు రేపుతోంది.

మరోవైపు సుఖేష్‌కు అసలు తెలుగు భాష వస్తుందా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ సంభాషణలో సుఖేష్‌ను కవిత బ్రో అని సంబోధించారు. కవితను సుఖేష్‌ కవిత అక్కా.. అని తెలుగులో పిలవడం విశేషం. సుఖేష్‌ 200 కోట్ల రూపాయల మనీల్యాండరింగ్‌ కేసులో అరెస్టయి ఢిల్లీ జైలులో ఉన్నాడు. ఆప్‌ నేతలపై ఇటీవల సంచలన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.

ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మరోసారి చెలరేగిన దుమారం!

Exit mobile version