MLA Rohit Reddy : తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే.. నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన రోహిత్‌రెడ్డిని ఈడీ విచారణకు పిలవడం కలకలం రేపింది. ఈడీ విచారణకు హాజరైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫిర్యాదు చేసినందుకు తనమై బీజేపీ పెద్దలు కక్ష్యగట్టారని, ఏది ఏమైనా తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
తనను ఏ కేసులో విచారణకు పిలిచారో కూడా తెలియదని రోహిత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేవలం తన బయోడేటా, వ్యక్తిగత వివరాలతో పాటు బిజినెస్ సంబంధిత వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తీసుకున్నారని చెప్పారు రోహిత్‌రెడ్డి. రెండో రోజు విచారణకు పిలిచిన అనంతరం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై పిలిచినట్లు తెలిపారన్నారు. మరోవైపు తన సోదరుడితో వ్యాపార లావాదేవీలు జరిపారనే అనుమానంతో కేసుతో ఏ సంబంధం లేని అభిషేక్‌ను కూడా విచారణకు పిలిచారని రోహిత్‌రెడ్డి చెప్పారు.
బీజేపీ బండారం బయటపెట్టాననే అక్కసుతోనే తనపై కక్షసాధింపు చర్యలకు దిగారని రోహిత్‌రెడ్డి మండిపడ్డారు. ఈడీ, సీబీఐలను తన మీదకు బీజేపీ పెద్దలే ఉసిగొల్పారని, ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు రోహిత్‌రెడ్డి. ఈడీ విచారణకు రావాలని ఇచ్చిన నోటీసులపై న్యాయపోరాటం చేస్తానని, వీటిని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానని వెల్లడించారు.
హైకోర్టులోనే తేల్చుకుంటా..
ఎక్కడైనా ఫిర్యాదు చేసిన వారిని మొదట విచారిస్తారా? అని రోహిత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఫిర్యాదు చేసిన బాధితుడైన తనను తొలుత విచారణకు పిలవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అనుమానితులను విచారణ చేయకుండా ఉద్దేశపూర్వకంగానే తనపై ఈడీని ప్రయోగిస్తున్నారని ఆరోపించారు రోహిత్ రెడ్డి. ఈ కేసులో ఎలాగైనా తనను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని.. బీజేపీ వ్యవహారం దొంగే దొంగ అన్నట్లు ఉందన్నారు. తనను అరెస్టు చేయాలనే ప్లాన్‌లో ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్న రోహిత్‌రెడ్డి.. దీనిపై హైకోర్టులోనే తేల్చుకుంటానన్నారు.
also read news:
Amazon Prime : అలరించే 5 ప్రైమ్ వీడియో సీరీస్ లు మీకోసం..
Rewind 2022 : ఈ ఏడాది బాలీవుడ్ లో బోల్తా పడిన సినిమాల గురించి తెలుసుకోండి.