తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జూరిక్ నగరంలో వందలాది మంది ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. తాను కూడా ప్రవాస భారతీయుడినేనని చెప్పారు.
IT & Industries Minister @KTRTRS, who is on a visit to Davos, Switzerland to attend World Economic Forum meeting scheduled from January 16 to 20, was accorded a grand welcome by the NRIs at Zurich airport.#TelanganaAtDavos#WEF23#InvestTelangana pic.twitter.com/FtdcaQ6cca
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 15, 2023
సంక్రాంతి పండుగను ప్రవాస భారతీయులతో జరుపుకోవడం ఆనందంగా ఉందని కేటీఆర్ తెలిపారు. తనకు విశేష స్వాగతం పలుకుతున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాను కొంతకాలం పాటు విదేశంలో పని చేసి తర్వాత ఇండియా వెళ్లానని కేటీఆర్ చెప్పారు. అందువల్ల తాను కూడా ప్రవాస భారతీయుడినేనని తెలిపారు. అయితే, స్విట్జర్లాండ్ వచ్చిన ప్రతిసారీ తనకు ఎంతో ఆత్మీయ స్వాగతం లభిస్తోందని, ఇక్కడి ప్రవాస భారతీయులు ఇచ్చే తనకు ఇచ్చేమద్దతు గొప్పగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
భారతదేశంలో ఉన్న వారితో పోల్చుకుంటే ప్రవాస భారతీయులకు ఇండియాలోని వ్యవహారాలు, స్థానిక అంశాలు, అభివృద్ధి విషయంలో కాస్త మక్కువ ఎక్కువగా ఉంటుందని కేటీఆర్ చెప్పారు. దావోస్ వచ్చిన ప్రతిసారీ తనకు స్విట్జర్లాండ్‌లో మంచి ఆప్యాయత లభిస్తుందని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. మానవ జీవితం చాలా పరిమితమైనదని, ఈ సత్యాన్ని నమ్మిన తాను సాధ్యమైనంత వరకు ప్రజలకు మంచి చేయడానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.
దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం..
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందని వివరించారు. ఓవైపు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీ శాఖకు తగినంత ప్రచారం కలుగుతోందన్నారు కేటీఆర్. మరోవైపు వ్యవసాయ రంగంలో పంట ఉత్పత్తులు అనేక రెట్లు పెరిగాయని గుర్తు చేశారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా తెలంగాణలోని అనేక గ్రామాలు, పట్టణాలు గుర్తింపు పొందాయన్నారు. సీఎం కేసీఆర్ దేశంలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా మలిచారని కేటీఆర్ తెలిపారు.
also read news:
Kodi Pandalu : ఏపీలో విచ్చలవిడిగా కోడి పందాలు.. ఎన్నికోట్లు చేతులు మారాయంటే..!
Viral video : ఈ బుడ్డోడి ఫ్రెండ్లీ నేచర్ చూస్తే అవాక్కవుతారు..