టీమిండియాకి దొరికిన ఆణిముత్యం సూర్యకుమార్ యాదవ్. మెరుపు తీగలా టీమిండియా జట్టులోకి వచ్చిన సూర్య మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. అతని ఆటతీరుపై ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆస్ట్రేలియా హిట్టర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ సైతం స్కై ఆటను చూసి ముచ్చటపడడంతో పాటు ఆయనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాష్ లీగ్‌లో సూర్య ఆడే అవకాశాలపై మ్యాక్సీ స్పందిస్తూ.. సూర్యను కొనుగోలు చేయడానికి మా దగ్గర సరిపడా డబ్బు లేదు. అతణ్ని కొనాలంటే మా జట్టులోని అందరు ఆటగాళ్లను వదులుకోవాల్సి వస్తుంది. క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ ప్లేయర్లను కూడా తప్పిస్తే కాని, అప్పుడు గానీ మేం అతణ్ని దక్కించుకోలేం’’ అని మ్యాక్స్ వెల్ అన్నాడు.
అంటే సూర్యకుమార్ యాదవ్‌కు భారీ ధర వెచ్చించాలనే అర్థం వచ్చేలా మ్యాక్సీ ఈ కామెంట్స్ చేశాడు. గత కొద్ది రోజులుగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సూర్య పరుగుల సునామి సృష్టిస్తున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌పై 51 బంతుల్లో 111 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే సూర్య ఎలా ఆడుతున్నాడని ప్రశ్నించగా.. ‘నాకు ఆ గేమ్ గురించి అంతగా తెలీదు. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు కార్డ్ చూసి, దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఆరోన్ ఫించ్‌కు పంపించాను. అక్కడేం జరుగుతుందని ఫించీని అడిగినట్టు చెప్పుకొచ్చాడు.
ఈ మోటు మనిషి మరో గ్రహం మీద బ్యాటింగ్ చేస్తున్నట్టుగా ఉంది. మిగతా ఆటగాళ్లందరి స్కోర్లు , ఇతడి స్కోర్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.. 50 బంతుల్లో 111. తర్వాతి రోజు ఫుల్ ఇన్నింగ్స్ చూశాను.. అది అసాధారణం’’ అని సూర్యపై మ్యా్క్స్‌వెల్ ప్రశంసల వర్షం గుప్పించాడు. అయితే మిగతా అందరి కంటే సూర్య ఎంతో మెరుగైన ఆటగాడు కాని, అతని ఆటను చూడటం కొంత కష్టం. విచిత్రంగా.. వికారం కలిగించేలా, అటు ఇటు నడుస్తూ.. చూయింగ్ గమ్ నములుతూ.. గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడుతున్నాడు’’ అంటూ మ్యాక్స్‌వెల్ వ్యాఖ్యానించాడు.
also read news:
ఆపిల్ తో ప్రయోజనాలు ఎన్నో.. మీరూ తినండి
ఆపిల్ తో ప్రయోజనాలు ఎన్నో.. మీరూ తినండి