Wednesday, May 15, 2024
Homerecipesమెంతికూర నువ్వుల పచ్చడి.. ఇలా చేస్తే భ‌లే రుచిగా ఉంటుంది..

మెంతికూర నువ్వుల పచ్చడి.. ఇలా చేస్తే భ‌లే రుచిగా ఉంటుంది..

Telugu Flash News

మెంతికూర నువ్వుల పచ్చడి (fenugreek sesame chutney) కి కావాల్సిన పదార్థాలు :

  • తాజా మెంతికూర కట్టలు- ఐదు,
  • చింతపండు- 50 గ్రా.,
  • నువ్వులు- 20 గ్రా.,
  • నువ్వుల నూనె- పావుకేజీ,
  • ఎండుమిర్చి- ఇరవై,
  • మెంతులు, ఆవాలు- నాలుగు టీస్పూన్ల చొప్పున,
  • పసుపు- టీస్పూన్,
  • ఉప్పు- తగినంత,
  • కారం- రెండు టీస్పూన్లు.

మెంతికూర నువ్వుల పచ్చడి తయారీ విదానం :

మెంతికూరను శుభ్రంగా కడిగి కాగితం మీద పరిచి నీడన ఆరనివ్వాలి. కడాయిలో నూనె వేడిచేసి మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, నువ్వులు వేయించి చల్లార్చాలి.మెంతికూరను కూడా అదే కడాయిలో వేయించిన తర్వాత మరో పాత్రలోకి తీసుకోవాలి.

చింతపండులో అరగ్లాసు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. చల్లారిన మెంతులు, నువ్వులను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని ఉడికించిన చింతపండు, మెంతికూర, ఉప్పు వేసి మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన నూనెను వేడిచేసి అందులో ఆవాలు, ఇంగువ, కారం వేసి అదంతా పచ్చడిలో వేసి కలపాలి.

మెంతికూర పచ్చడి చక్కని సువాసతో చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ పచ్చడి, కాస్త నెయ్యి వేసుకుని తింటే ఇంకా రుచిగా ఉంటుంది. తడి తగలకుండా ఉంటే నెల రోజులపాటు నిల్వ ఉంటుంది కూడా.

ఇంకా చదవండి :

-Advertisement-

సూర్య‌కుమార్ యాద‌వ్ ని కొన‌డానికి మా దగ్గర సరిపడా డ‌బ్బు లేదు

Sai Pallavi: సాయి ప‌ల్ల‌వి సంచ‌ల‌న నిర్ణ‌యం… ఇక సినిమాల‌కు పూర్తిగా దూర‌మైన‌ట్టేనా..!

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News