Homeandhra pradeshMandous Cyclone: మాండౌస్‌ తుఫాన్‌ బాధితులకు ఆర్థికసాయం.. ఏపీ సీఎం జగన్‌ ఎంత ప్రకటించారంటే..!

Mandous Cyclone: మాండౌస్‌ తుఫాన్‌ బాధితులకు ఆర్థికసాయం.. ఏపీ సీఎం జగన్‌ ఎంత ప్రకటించారంటే..!

Telugu Flash News

మాండౌస్‌ తుఫాన్‌ (Mandous Cyclone) అల్లకల్లోలం సృష్టిస్తోంది. తుఫాన్‌ నిన్న బలహీనపడి తమిళనాడుకు సమీపంలో తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో తమిళనాడుతో పాటు, ఏపీ, తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనేక చోట్ల బాధితులను పునరావాస ప్రాంతాలకు తరలించారు.

మరోవైపు తుఫాన్‌ ప్రభావంపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. బాధితులను తక్షణమే ఆదుకోవాలని కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు. తుఫాన్‌ బాధితులకు ఒక్కొక్కరికి 2 వేల రూపాయల ఆర్థికసాయం ప్రకటించిన జగన్‌.. వరద ప్రభావం తగ్గే వరకు బాధితులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పునరావాస కేంద్రాల నుంచి వెళ్లేటప్పుడు ప్రతి బాధితుడికీ ఈ నగదు అందించి పంపాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

తుఫాన్‌ ప్రభావం చూపిన అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోని బాధితులకు ఈ ఆర్థికసాయం వెంటనే చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు జగన్‌. ఇక తుఫాన్‌ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని డ్యామ్‌లు దాదాపు పొంగిపొర్లుతున్నాయి. తిరుపతి జిల్లాలో తుఫాన్‌ దాటికి అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి. తిరుమలలో వర్షం కురుస్తున్నా లెక్క చేయక భక్తులు క్యూలైన్‌లో స్వామి వారి దర్శనానికి వెళ్లారు.

రాయలసీమకు ఆరెంజ్‌ అలర్ట్‌..

చిత్తూరు జిల్లాలోనూ అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరదనీరు ప్రవహించడంతో పుంగనూరులో కాలనీలు జలమయం అయ్యాయి. తిరుపతిలోనూ అనేక కాలనీలు నీట మునిగాయి. మోకాళ్ల లోతు నీటిలోనూ బాధితులను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ అనేక పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయి. తాజాగా ఈ రోజు ఉదయం రాయలసీమకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

also read news:

Kavitha: కవిత ఇంట్లో సీబీఐ బృందం.. విచారణ ఎలా సాగుతోందంటే..!

-Advertisement-

Sreemukhi Latest Photos in a purple dress 11-12-2022

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News