Maldives : సౌర కాంతిలోని దీవులు’గా ‘రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్’గా పిలువబడే 1000 చిన్న ద్వీపాలు, 20 పగడపు వృతాకారదీవులతో కూడిన ఈ దేశం వర్ణనకు తగ్గట్లుగానే ఉంటుంది. భారత ఉపఖండ దక్షిణపు అంచుకు పశ్చిమంగా 250 మైళ్ళ దూరంలో శ్రీలంకకు నైరుతిగా 400 మైళ్ల దూరంలో హిందూమహా సము ద్రానికి దాదాపు మధ్యలో ఈ దేశం ఉంటుంది.
ఈ దేశంలోని 20 పెద్ద పగడపు వృత్తాలు ఉత్తరం నుంచి దక్షిణానికి 500 మైళ్ళమేర మూత్యాల దండలో మూత్యాల అమరికలా ఉంటాయి. చివరి పగడపు వృత్తాలు భూమధ్య రేఖకు కొద్దిగా ఉత్తరంగా ఉంటాయి. 200 లఘుద్వీపాలలో స్థిరనివాసాలు ఏర్పాటు అయినాయి. 87 లఘుద్వీపాలను పూర్తిగా పర్యాటకుల కోసం కేటాయించటం జరిగింది.
అద్భుతమైన బీచ్‌లు, అతి వింతైన సముద్రాంతర నిక్షేపాలతో కూడిన మాల్దీవులు ప్రపంచం నలు మూలల నుంచి జలాంతర్భాగ పర్యాటకులు, ఈత ఈదే వారికి సూర్యారాధకులైన వాయు పర్యాటకులకు, సరదాకు చిన్న బోట్లు నడిపేవారిని ఆకర్షిస్తుంటుంది.
తెల్లని ఇసుకతో నిండిన బీచ్‌లు, స్ఫటిక స్వచ్ఛతగల తీర ప్రాంత జలాలు, నీలాకాశాలు, నిరంతర సూర్యకాంతి మాల్దీ వులను ట్రావెల్ మాగజైన్ల ముఖచిత్రంగా వచ్చేటట్లు చేశాయి. ట్రావెల్ ఏజంట్లకు, సెలవులను గడపాలనుకొనే వారికి ఎంతో ఇష్టమైన ప్రదేశంగా చేశాయి. సముద్రం లోపలి భాగంలో మాల్దీ వులను నిజమైన ప్రాకృతిక స్వర్గంగా చెప్పవచ్చు.
పగడపు దీవుల చుట్టూ ఉండే సముద్రజలాల్లో అన్వేషిస్తూ తిరిగే వారికి ఉష్ణ ప్రాంత సముద్రజలాలలో జీవించే అన్ని రకాల జీవజాలం కనువిందు చేస్తుంది. సముద్రపునీటి ఉష్ణోగ్రత ఎప్పుడు 80°F కంటె ఎక్కువగానే ఉంటుంది. ఈశాన్యంలో వర్షాకాలం అయిన నవంబరునుండి మార్చి వరకు, నైరుతిలో వర్షాకాలం అయిన జూన్ నుంచి ఆగస్టు వరకు కూడా ఉష్ణోగ్రత 75°F నుంచి 90°F వరకు ఉంటుంది. ఇది పర్యాటకులను ప్రత్యేక ఆకర్షణ. దీని ఆకర్షించే చారిత్రక నేపథ్యం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను మసక బారేటట్లు చేశాయి.
ఎలా మొదలైంది
క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో భారతదేశం, శ్రీలంకలకు చెందిన బౌద్ధమత జాలర్లు మొదటిగా ఈ దీవులలో నివాసం ఏర్పరచుకొన్నారు. అరబ్బు వర్తకులు మరియు వ్యాపారస్తులు క్రీస్తు శకం 12వ శతాబ్దంలో దీన్ని ఆక్రమించుకొని సుల్తాన్ రాజ్యం ఏర్పాటు చేసి ఇస్లాంను అధికారమతంగా ప్రకటించారు. 16వ శతాబ్దంలో పోర్చుగీసువారు అక్కడ తమ స్థావరం ఏర్పాటు చేయటం కోసం జరిగిన యుద్ధంలో ఓడిపోయారు.
17వ శతాబ్దంలో డచ్ వారు దీన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. క్రీస్తుశకం 1796వ సంవత్సరంలో డచ్ వారు దీన్ని ఇంగ్లండ్ వారికి వదిలి వేయటం జరిగింది. 1887వ సంవత్సరం నుంచి 1965వ సంవత్సరం వరకు ఇది ఇంగ్లండ్ వారికి రక్షక స్థావరంగా కొనసాగింది. 1953వ సంవత్సరంలో ఇది రిపబ్లిక్ అవతరించినా, అక్కడి ప్రజలు మొహమ్మద్ ఫరీద్ దీదీ నాయకత్వంలో మళ్ళీ సుల్తాన్ రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు.
సుల్తాన్ రాజ్యంగా కాకుండా గణతంత్రంగా కొనసాగటానికి మాల్దీవుల ప్రజలు ఒప్పుకోవటం వల్ల 1965 సంవత్సరం జులై 26న మాల్దీవులు స్వాతంత్ర్యాన్ని పొందింది. దేశాధ్యక్ష పదవికి అంతులేని అధికారాలు సమకూర్చబడ్డాయి. నేడు మాల్దీవుల్లో ఎలాంటి రాజకీయ పార్టీలు కాని మతస్వేచ్ఛకాని లేదు. రాజ్యాంగపరంగా సున్నీ ఇస్లాం కాకుండా మిగిలిన అన్ని మతాలు నిషేధించబడ్డాయి.
పౌరహక్కుల ఉల్లంఘన, నేరాలు సర్వసాధారణమయిపోయింది. ఇస్లాం మతం మద్యంను నిషేధిం చటంవల్ల పర్యాటక రంగానికి చెందిన అన్ని ఉద్యోగాల్లో విదేశీయుల్ని నియమించటం జరుగుతుంది. మద్యం సరఫరా చేసేవారు, వంటపనివారు, హోటల్ పనివారుగా పనిచేసే వాళ్ళలో ఎక్కువ శాతం మంది శ్రీలంక, ఇండోనేషియా, ఇండియా మిగిలిన ముస్లిమేతర దేశాల్నించి వచ్చిన వారే.
ఈ సామాజిక సమస్యలతోపాటు ఈ దీవులు ఇంకో పర్యా వరణ టైమ్ బాంబ్ బారిన పడబోతోంది. వాతావరణంలో గ్రీన్ హౌస్ గ్యాస్‌లు ఇలాగే పెరుగుతూ ఉంటే దాని విష ప్రభావం సముద్ర మట్టానికి అతి తక్కువ ఎత్తులో ఉండే మాల్దీవుల మీదే ముందుగా పడుతుంది. ప్రపంచ వ్యాప్త ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల సముద్రమట్టంలో పెరుగుదలచేత సంభవించే ఉప్పెనల్లో మాల్దీవులు సమీప భవిష్యత్తులో సముద్రగర్భంలో కలిసిపోయే అవకాశం చాలా ఎక్కువగా వుంది.
వివరములు
పేరు : ‘రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్’ అని దీని అధికారిక నామం
పరిమాణం : 20 పగడపు వృత్తదీవులు, 2000 లఘుదీవుల తో కూడి వుంటుంది. 200 లఘుదీవులలో ప్రజలు స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. 87 ద్వీపశకలాలు పూర్తిగా పర్యాటకుల వసతులకోసం అభివృద్ధి చేయబడ్డాయి.
వైశాల్యం : ఈ ద్వీపాలు అన్నిటి వైశాల్యం 15 చదరపు మైళ్లు.
జనాభా : దాదాపు 3,50,000 మంది.
also read :
Viral Video : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తన్వీ గీతా రవిశంకర్.. బేషరం సాంగ్‌ను దించేసింది!
Pavitra- Naresh: పవిత్ర లోకేష్- నరేష్ కిస్ వెనక సీక్రెట్ పెళ్లి కాదు.. మరొకటి ఉంది..!