నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో తన తాజా చిత్రం NBK 107 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని సిరిసిల్లలో జరుగుతోంది.
ఈ యాక్షన్ డ్రామాలో మలయాళ దర్శకుడు, నటుడు లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అతని చివరి తెలుగు చిత్రం సాహో. వీరితో పాటు కన్నడ నటుడు దునియా విజయ్, తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.
-Advertisement-