HomecinemaMahesh Babu: మ‌హేష్ బాబు దుబాయ్‌లో కాస్ట్ లీ విల్లా కొనుగోలు చేశాడా.. ఇందులో నిజ‌మెంత‌?

Mahesh Babu: మ‌హేష్ బాబు దుబాయ్‌లో కాస్ట్ లీ విల్లా కొనుగోలు చేశాడా.. ఇందులో నిజ‌మెంత‌?

Telugu Flash News

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మ‌హేష్ ఫ్యామిలీ ప‌ర్స‌న్ అనే విష‌యం తెలిసిందే. ఆయ‌న టైం దొర‌కితే కుటుంబంతో విదేశాల‌కి చెక్కేస్తుంటాడు. రీసెంట్‌గా ఆయ‌న దుబాయ్ ట్రిప్ వేశారు. ఈ క్ర‌మంలో ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

ఆయ‌న దుబాయ్ లో ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియో చెబుతుంది. పాష్ ఏరియాలో ఆ విల్లా ఉంద‌ని, దాని ఖ‌రీదు కోట్ల‌లోనే ఉంటుంద‌ని అంటున్నారు. ఈ సారి మ‌హేష్ బాబు దుబాయ్ వెళ్లింది ఎంజాయ్‌మెంట్ కోసం కాద‌ని, ఈ ఖరీదైన ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయ‌డం కోస‌మ‌ననే టాక్ న‌డుస్తుంది. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

సినిమాలతో పాటు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్, బిజినెస్ ల ద్వారా మ‌హేష్ భారీగా సంపాదన కూడ‌బెడుతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ప్ర‌స్తుతం తన 28వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగ‌తుంది. దీని త‌ర్వాత రాజమౌళితో SSMB 29 చేయనున్నారు.ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యూనివర్సల్‌ అడ్వెంచర్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కించ‌నున్న‌ట్టు టాక్.

also read :

Mahesh babu: మ‌హేష్ బాబు గ్లామ‌ర్ సీక్రెట్ ఇదే.. అందం కోసం విదేశాల‌లో

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News