HomecinemaMahesh Babu: మహేష్ -త్రివిక్రమ్ మధ్య గొడవ.. సినిమా ఆగినట్టేనా?

Mahesh Babu: మహేష్ -త్రివిక్రమ్ మధ్య గొడవ.. సినిమా ఆగినట్టేనా?

Telugu Flash News

Mahesh Babu: సినిమాల గురించి సినిమా సెల‌బ్రిటీల గురించి సోష‌ల్ మీడియాలో ఎన్నో ప్ర‌చారాలు జ‌రుగుతంటాయి. వాటిలో నిజ‌మెంత ఉందో తెలియ‌క అభిమానులు ఆందోళ‌న చెందుతుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు జీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఇటీవ‌ల హ్యాట్రిక్ సినిమా మొదలైన విష‌యం తెలిసిందే. కల్ట్ క్లాసిక్ హిట్ ‘అతడు’, ఇమేజ్ మేకోవర్ ఫిల్మ్ ‘ఖలేజా’ తర్వాత… ఈ ఇద్దరూ ముచ్చటగా మూడో సినిమా కోసం క‌లిసి ప‌ని చేస్తున్నారు. చిత్రంలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడ‌ని, ఈ సినిమా నుండి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్న‌రు.

ఆ మ‌ధ్య ఈ చిత్రానికి ‘అమరావతి కి అటు ఇటు…’ ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. అని అన్నారు. మరో రెండు టైటిల్స్ కూడా డిస్కషన్ లో ఉన్నాయ‌ని…. అడవిలో అర్జునుడు, ఆమె కథ, అమ్మ కథ, అమరావతికి అటు ఇటు లాంటి టైటిల్స్ లో ఒక టైటిల్ సినిమాకి ఫిక్స్ చేయ‌బోతున్న‌ట్టు డిస్క‌షన్స్ సాగాయి. అయితే మూవీకి సంబంధించి అనేక ప్ర‌చారాలు సాగుతున్న నేపథ్యంలో తాజాగా షాకింగ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. మొద‌టి నుండి సినిమాపై అసంతృప్తిగా ఉన్న మ‌హేస్ సినిమా అభ్యంత‌రం వ్యక్తం చేస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది. సినిమా ప్రారంభంలో రూపొందించిన యాక్షన్‌ సీక్వెన్స్ లు మ‌హేష్ కి అంత న‌చ్చ‌క‌పోవ‌డంతో క్యాన్సిల్ చేశార‌ట‌.

దీంతో యాక్ష‌న్ డైరెక్ట‌ర్స్ ని కూడా మార్చార‌ని, ఇప్పటి వరకు తీసిందంతా పక్కన పెట్టి మళ్లీ సినిమా షూటింగ్‌ చేయాల్సి వస్తుందని ప్ర‌చారం అయితే న‌డుస్తుంది. త్రివిక్రమ్‌.. ఇప్పుడు పవన్‌ సినిమాలకు ఘోస్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న నేప‌థ్యంలో మ‌హేష్ సినిమాపై పెద్ద‌గా ఆస‌క్తి పెట్ట‌డం లేదని వినికిడి. తన సినిమా చేస్తూ మరో హీరో సినిమాలతో త్రివిక్రమ్‌ బిజీగా ఉండటం మహేష్‌కి నచ్చడం లేదని, దీంతో ఇద్ద‌రి మ‌ధ్య ఈగో సమస్య‌లు త‌లెత్తాయ‌ని టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది రానున్న రోజుల‌లో తెలియ‌నుంది. కాగా, త్రివిక్ర‌మ్ `హరిహర వీరమల్లు`, `వినోదయ సీతం` రీమేక్‌, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, `ఓజీ` చిత్రాలకి ద‌గ్గరుండి అన్ని ప‌నులు చూసుకుంటున్నాడ‌ట‌.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News