Homehealthlemon benefits : నిమ్మకాయ‌తో ప్రయోజనాలు ఎన్నో !!

lemon benefits : నిమ్మకాయ‌తో ప్రయోజనాలు ఎన్నో !!

Telugu Flash News

lemon benefits : నిమ్మకాయ, సిట్రస్ జాతికి చెందినది. నిమ్మ కాయలతో మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడే గుణాలతో పాటు అందాన్ని పెంచే గుణాలు కూడా ఈ నిమ్మకాయలో ఉన్నాయి. నిమ్మకాయలు సీజనల్ వ్యాధులు రాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎండా కాలంలో ఒంట్లో వేడిని తగ్గించేందుకు కూడా ఇవి సహకరిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే నిమ్మకు లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం..!

నిమ్మకాయ యొక్క ప్రయోజనాలు

నిమ్మరసం యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి ల‌భిస్తుంది. నిమ్మరసం రెగ్యులర్ గా తాగే వారిలో వయసు పెరిగినా కూడా చర్మం ముడతలు పడవు. దీని వల్ల వయసు పైబడిన వృద్ధాప్య చాయ‌లు అంత త్వరగా రావు.

రోజూ ఉదయం, సాయంత్రం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి కొత్త ఉత్సాహం వస్తుంది.

నిమ్మరసం కూడా పంటి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మరసం తరచుగా తీసుకోవడం వల్ల చిగుళ్లలో రక్తస్రావం తగ్గుతుంది.

నిమ్మరసం మన కాలేయంలో పేరుకుపోయిన విష పదార్థాలను తొలగించి శుద్ధి చేయడంలో బాగా పనిచేస్తుంది.

-Advertisement-

వేసవిలో నిమ్మరసం తాగడం వల్ల అలసట నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ఊబకాయం ఉన్నవారు రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్లను కరిగించడంలో కూడా సహాయపడుతుంది.

also read :

Ashok Selvan Keerthi Pandian wedding pics

pepper for weight loss : మిరియాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారా ?

Dengue fever : డెంగ్యూ జ్వరం అంటే ఏంటి ? లక్షణాలు, నివారణ తెలుసుకుందాం !

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News