HomecinemaSuperstar Krishna: కృష్ణ ఉన్న ఇల్లు మ‌హేష్‌కా, న‌రేష్‌కా.. అస‌లు విష‌యం చెప్పిన కృష్ణ త‌మ్ముడు..!

Superstar Krishna: కృష్ణ ఉన్న ఇల్లు మ‌హేష్‌కా, న‌రేష్‌కా.. అస‌లు విష‌యం చెప్పిన కృష్ణ త‌మ్ముడు..!

Telugu Flash News

Krishna: సూపర్ స్టార్ కృష్ణ మరణించి అప్పుడే వారం అయింది. నిన్న మహేష్ త‌న తండ్రి అస్థిక‌ల‌ని కృష్ణాన‌దిలో క‌లిపారు. మ‌హేష్‌ని చూస్తే ఇప్ప‌టికీ ఆయ‌న తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే కృష్ణ సినీ ఇండస్ట్రీకి రాకముందు ఇందిరను పెళ్లి చేసుకోగా, వారికి 1965 అక్టోబర్ 13 న‌ రమేష్ జన్మించారు.

వీరికి మొత్తం ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కొడుకు రమేష్ ఈ ఏడాది జనవరి 8న మరణించిన విష‌యం తెలిసిందే.. చిన్న కొడుకు మహేష్ సినిమాల్లో కొనసాగుతుండ‌గా, . కుమార్తెల్లో పద్మజ, ప్రియదర్శిని ఇంటికే ప‌రిమితం కాగా, మంజుల మంజుల సినీ ఫీల్డులో కొనసాగుతున్నారు.

2019లో విజయనిర్మల మరణం తరువాత కృష్ణ తీవ్ర దు:ఖంలో ఉన్నారు. అయితే ఇదే సమయంలో నరేష్ కృష్ణ వెంటే ఉంటూ విజయనిర్మల లేని లోటును తీర్చారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కృష్ణ మ‌ర‌ణించే వ‌ర‌కు ఆయ‌న‌కు తోడుగా ఉన్నారు. అలా కృష్ణ మరణించేవరకు నరేష్ తన బాగోగులు చూసుకున్నందున కృష్ణకు నరేష్ అంటే ఎంతో అభిమానం అట‌.

కృష్ణ చివరిసారిగా గడిపిన నివాసాన్ని నరేష్ కే ఇచ్చార‌ని కృష్ణ త‌మ్ముడు ఆదిశేష‌గిరిరావు తెలియ‌జేశారు. . మెమోరియల్‌ బిల్డింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం కాని, అది ఎక్కడ, ఎలా ఏర్పాటు చేయాలనేది త్వ‌ర‌లో నిర్ణయం తీసుకుంటాం ఆయ‌న పేర్కొన్నారు.

ఇక కృష్ణ అంత్యక్రియల విషయంలో విమర్శలు వినిపించాయి. ఫామ్‌ హౌస్‌లో చేయకుండా మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఎందుకు చేశార‌ని కొంద‌రు విమ‌ర్శించారు. అయితే మొదట మహేశ్వరంలోని పద్మాలయా స్టూడియోలో అంత్యక్రియలు చేద్దాం అని అంద‌రం అనుకున్నాం, కానీ దూరం అవుతుందని వెనక్కి తగ్గాం.

మా ఫామ్‌ హౌస్‌లో చేయాలనే ఆలోచన రాగా, జనం ఎవరినీ రానివ్వకుండా ఎక్కడో దూరంగా అనాధలా చేయడం మాకు ఇష్టం లేక మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరిపించాం. గచ్చిబౌలి స్టేడియంలో పార్ధివ దేహాన్ని ఉంచాలని అనుకున్నాం. కాక‌పోతే మంచు విపరీతంగా పడుతుండడంతో అందరికీ ఇబ్బంది అవుతుందని మా పద్మాలయా ఆఫీసులో ఉంచాం అని ఆదిశేష‌గిరి రావు చెప్పుకొచ్చారు.

-Advertisement-

also read news:

మెరుగైన మెదడు పనితీరు కోసం ఒమేగా-3.. ఏ ఏ ఆహారాల ద్వారా ల‌భిస్తుందంటే ?

చలికాలం లో పుణుగులు తింటే ఆ మజానే వేరు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News