నెల్లూరు జిల్లాలో తాజాగా ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రభుత్వంపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే మండిపడుతున్నారు. ఎన్నికలకు ఇంకా 15 నెలలు సమయం ఉన్నా అప్పుడే నువ్వా నేనా అన్నట్లు ఏపీలో వాతావరణం ఏర్పడింది.
తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam reddy Sridhar Reddy) ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తూ దొంగచాటుగా తన మాటలు వింటున్నారని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన రుజువులు కూడా మీడియా ముందు బయట పెట్టారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు తనకునేరుగా ఫోన్ చేసి తాను, తన ఫ్రెండ్ మాట్లాడుకున్న ఆడియోను పంపారని శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఇది అబద్ధమైతే తాను దేనికైనా సిద్ధమన్నారు.
తనది ఐఫోన్ అని, తన ఫ్రెండ్‌ది కూడా ఐఫోనే అని కోటంరెడ్డి వెల్లడించారు. రెండు ఐఫోన్ల మధ్య ఫోన్ రికార్డింగ్ ఉండదని, ఇది ట్యాపింగ్‌తోనే సాధ్యమైందన్నారు కోటంరెడ్డి.
దొంగచాటుగా ఇలా చేయడం పద్ధతి కాదని, అనుమానాలు ఉన్న చోట తాను ఇమడలేనంటూ వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్లు కోటంరెడ్డి స్పష్టం చేశారు. సుమారు 35 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, నలుగురు ఎంపీలు తనకు ఫోన్ చేసి తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పారని కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ట్యాపింగ్ ఇంతటితో ఆగదని, రేపు మంత్రులు, హైకోర్టు జడ్జిలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఎంపీలు, మీడియా యాజమాన్యాలు, ముఖ్యమంత్రికి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారని ఆరోపించారు.
ఇది ఏరకంగా న్యాయమని కోటంరెడ్డి సీఎం జగన్‌ను ప్రశ్నించారు. తాను మొదటి నుంచి వైసీపీకి విధేయుడగా ఉన్నానని కోటంరెడ్డి గుర్తు చేశారు. తనను అవమానిస్తూ సొంత పార్టీనే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇరవై రోజుల కిందటే ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారం దొరికిందని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయడం లేదని కోటంరెడ్డి క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు.
also read news:
Vijay- Rashmika : రష్మిక, విజయ్ మధ్య ఏం నడుస్తుంది..? మొన్న మాల్దీవులు.. ఇప్పుడు దుబాయ్ టూర్..
Adani Group : ఎఫ్‌పీవో రద్దు చేసుకున్న అదానీ గ్రూప్.. 20వేల కోట్లు ప్రాజెక్టుపై వెనక్కి!
YS Sharmila: గవర్నర్ తమిళిసైతో షర్మిల భేటీ.. పాదయాత్ర పునఃప్రారంభం..