Telugu Flash News

Kodi Pandalu : ఏపీలో విచ్చలవిడిగా కోడి పందాలు.. ఎన్నికోట్లు చేతులు మారాయంటే..!

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు (kodi pandalu)  మిన్నంటాయి. పేరుకు సంక్రాంతి ఫెస్టివల్‌.. హవా అంతా కోడి పందాలదే అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో భారీగా కోడి పదాలు సాగుతున్నాయి. గ్రామాల శివార్లలోని పొలాల్లో పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేసి యధేచ్చగా కోడి పందాలు సాగిస్తున్నారు నిర్వాహకులు. ఓవైపు కోడి పందాల నిర్వహణపై హైకోర్టు ఆదేశాలున్నా నిర్వాహకులు వాటిని లెక్క చేయడం లేదు.

కోడి పందాల నిర్వహణ సందర్భంగా భారీ మొత్తంలో నగదు చేతులు మారుతోంది. ఒక్క గోదావరి జిల్లాల్లోనే సుమారు నిన్న ఒక్కరోజు 200 కోట్ల రూపాయల వరకు చేతులు మారాయని టాక్‌ నడుస్తోంది. క్రికెట్‌ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు నిర్వహించినట్లుగా కోడి పందాల్లో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి ముందు రోజు నుంచే ప్రారంభమైన ఈ కోడి పందాలు.. సుమారు నాలుగు రోజులపాటు నిర్విరామంగా కొనసాగుతాయి. రేయింబవళ్లు ఫ్లడ్‌ లైట్లు వేసుకొని మరీ కోడి పందాలు నిర్వహిస్తున్నారు.

బరుల సమీపంలోనే మద్యం, మాంసం, బిర్యానీలు, వంటకాలు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అక్కడే మద్యం సేవించడం పందాల్లో బెట్టింగులు కాయడం జరుగుతున్నాయి. కోడి పందాలతో పాటు గుండాట, పేకాట, లోన బయట, పెద్ద బజార్‌, చిన్న బజార్‌ లాంటి కార్యక్రమాలు కూడా సాగుతున్నాయి. అయితే, భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్న పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ప్రజా ప్రతినిధులే ప్రారంభిస్తున్నారు..

పోలీసుల ఆంక్షలు, హైకోర్టు ఆదేశాలను పందెం రాయుళ్లు ఖాతరు చేయడం లేదు. నేరుగా ప్రజా ప్రతినిధులే ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తుండడంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదేమని అడిగి పోలీసులను రాజకీయ నాయకులు నోటికొచ్చినట్లు తిడుతున్నారు. కొన్ని చోట్ల కోడి పందాల మాటున క్యాసినో కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కోనసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల రాతిదూలం లాగుడు పోటీలు, జల్లికట్టు పోటీలు కూడా సాగుతున్నాయి.

also read:

Tamanna Latest hot photos at the Elle Graduates event

Viral video : ఈ బుడ్డోడి ఫ్రెండ్లీ నేచర్‌ చూస్తే అవాక్కవుతారు..

Exit mobile version