Eiffel Tower : ప్రత్యేకంగా కన్పించే ఈఫిల్ టవరు రూపు పారిస్ నగరానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యాన్ని సంతరించి పెట్టిన ఒక చిహ్నంగా చెప్పవచ్చు. క్రీ.శ. 1909వ సంవత్సరంలో దీన్ని కూల్చివేద్దామని నిర్ణయించబడ్డదికాని తర్వాత దీన్ని జాగ్రత్తగా పదిలంచేస్తూ వచ్చారు. ఈ రోజు ఈఫిల్ లేకుండా పారిస్ నగర ఆకాశ దృశ్యాన్ని ఊహించుకోలేం.
పారిస్ అనగానే ముందు గుర్తుకు వచ్చేంతగా పారిస్ నగరంతో అల్లుకుపోయిన ఈ టవర్ను గస్టావ్ ఈఫిల్ అనే ఇంజనీరు రూపకల్పన చేశాడు. ఫ్రెంచి తిరుగుబాటుకి 100 సంవత్సరాలు నిండిన కాలంలో నిర్వహించబడ్డ పారిస్ ఎగ్జిబి షన్లో భాగంగా క్రీ.శ. 1887-1889 సంవత్సరాల మధ్య కాలంలో ఈటవరు నిర్మించబడింది. దీన్ని నిర్మించిన గస్టాల్ ఈఫిల్ గౌరవార్థంగా దీన్ని ఈఫిల్ టవరుగా పిలవటం ప్రారంభించారు.
ఈఫిల్ టవరు ఎత్తు
ఈఫిల్ టవరు ఎత్తు 986 అడుగులు వుంటుంది. నిర్మాణం తర్వాత కాలంలో టవరు మీద బిగించిన యాంటెన్నాను కూడా కలుపుకుంటే దీని ఎత్తు దాదాపుగా 1050 అడుగులు ఉంటుంది. పారిస్ ఎగ్జిబిషన్లో ఇది అంకితమీయబడినప్పుడు ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన నిటారైన నిర్మాణంగా పేరుపొందింది.
ఈ టవరు నాలుగు స్తంభాలను ఖాళీ కాంక్రీటు పునాదితో ప్రతిష్టించబడ్డ తర్వాత అత్యంత దృఢత్వాన్ని కలుగచేసే ఒక ప్రత్యేక పద్ధతిలో కరిగించి పోతపోయబడిన ఉక్కుతో దీని నిర్మాణం ప్రారంభించాడు. గస్టావ్ ఈఫిల్ అండ్ మార్కు లో ఈ టవరు కు అవసరమైన అన్ని ఉక్కు భాగాలు ఒక్కొక్కటిగా పోతపొయ్యబడ్డాయి. తర్వాత వీటన్నిటిని పారిస్ ని ఛాంప్స్ డి మార్పుకు కలిపి కూర్చటానికి తరలించటం జరిగింది.
18,038 ప్రత్యేక ఇనుప పర్వికలను కలుపుతూ 25 లక్షల రివెట్లను కొట్టి 26 నెలల కాలంలో దీని నిర్మాణాన్ని పూర్తిచేశారు. దీనిని నిర్మాణంలో ఉపయోగించిన నిర్మాణ క్రమ పద్ధతి ఒక రకమైన సంచలనాన్ని కలుగచేసింది. నిర్మాణ రీత్యా ఈ కట్టడం సగం నిరంతరం క్రిందకు ఉండేటట్లు నిర్మించిన పోలివున్నా, సాంప్రదాయబద్ధంగా వాడే కొయ్యచట్రం బరులు ఉక్కు చట్రాన్ని వాడటం జరిగింది.
పాతకొత్త నిర్మాణ పద్ధతుల్ని మేళవింపు చేస్తూ సృష్టించబడిన ఒక నిర్మాణ యంత్ర విద్య యొక్క ఉత్కృష్ట కార్యంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
దీన్ని నిర్మించిన 20 సంవత్సరాల తర్వాత అంటే క్రీ.శ. 1909 సంవత్సరంలో దీన్ని కూల్చివేయాలని భావించారు. కాని అదే సమయంలో రేడియోతరంగాలకు సంబంధించి అనేక ఆవిష్కరణలు జరిగి ఇంత ఎత్తైన ఈ టవరు అట్లాంటిక్ ఆవలకు చేసే రేడియో తరంగ సమాచార రాకపోకలకు అనుకూలంగా ఉంటుందని దీనిమీద చాలా ఎత్తైన యాంటెన్నాను అమర్చారు. ఆ రకంగా ఈఫిల్ టవర్ పదిలంగా నిలిచిపోయింది.
ప్రకృతి శక్తుల నుంచి కాపాడటానికి
ఈ టవరు ప్రకృతి శక్తుల నుంచి అంటే గాలి, వాన ఇలాంటి బారి నుంచి కాపాడటానికి 7 సంవత్సరాల కొకసారి దీనికి రంగు పూస్తారు. మొత్తం 49 ఎకరాల మేర ఉపరితలం కలిగిన ఈటవరుకు రంగు వేయటానికి 25 మంది పెయింట ర్స్కు 15 నెలలు పడుతుంది. మొత్తం 60 టన్నుల పెయింటు, 1,500 పెయింటు బ్రష్లు, 5,000 ఒరిపిడి పెట్టే పళ్ళాలు అవసరమవుతాయి. అంత ఎత్తులో పనిచేసే పెయింటర్ల ప్రాణాలకు రక్షణగా 30 మైళ్ళ పొడుగువున్న మార్గదర్శక త్రాళ్ళు 2,15,000 చదరపు అడుగుల వల ఏర్పాటు చేయబడతాయి.
ఒకసారి పెయింటు వేయటానికి దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఎప్పుడూ కంచులోహపు రంగునేవాడతారు. పునాది దగ్గర చిక్కటి ఇత్తడి రంగుతో మొదలయి పైకి వెళ్ళే కొద్దీ రంగు చిక్కదనం గాఢత తగ్గిస్తూ వస్తారు. గస్టావ్ ఇఫెల్ దీన్ని 300 మీటర్ల వరుస అని పిలిచేవాడు. కాని ప్రజలు గస్టాల్ విమర్శకులు కూడా దీన్ని ఇఫెల్ టవర్గానే పిలవటం ప్రారంభించారు. ఈ టవరుకు సౌందర్య గుణభావం లోపించిందని ఎంతో మంది విమర్శకులు ఘాటైన పదజాలంతో విమర్శించారు.
అందరి విమర్శల్ని, భయాలను అధిగమిస్తు ఈటవరు, దీన్ని నిర్మించిన ఇంజనీరు ఇఫెల్ పేరు ప్రపంచంలో పదిలంగా నిలిచి పోయాయి. పారిస్ నగరవాసులు మాత్రం ఈ ‘ఇనుప వనిత’ను తమగుండెల్లో దాచుకొన్నారు. క్రీ.శ. 1889వ సంవత్సరం నుంచి నేటి వరకు దాదాపు 20 కోట్ల మంది ఇఫెల్ టవర్ను సందర్శించటం జరిగింది. ఇఫెల్ టవర్ పారిస్ నగరవాసులు జీవితాలతో పూర్తిగా పెనవేసుకుపోయింది.
also read :
Women’s Day 2023 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
Rashmika : రష్మికకి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ పంపిన అభిమాని.. తెగ ఎమోషనల్ అయిన నేషనల్ క్రష్
prostate cancer : ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి? లక్షణాలు, చికిత్స ఇలా..