Kl Rahul: గత కొంత కాలంగా పెద్దగా అంచనాలు అందుకోలేకపోతున్న కేఎల్ రాహుల్ టీ20 వరల్డ్ కప్‌లో చిన్న జట్లపై హాఫ్ సెంచరీలు బాది పెద్ద జట్లతో జరిగిన కీలక మ్యాచ్‌ల్లో మాత్రం తేలిపోయాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి వన్డేలో మిడిలార్డర్‌లో బరిలోకి దిగి కొంత ఆదుకున్నప్పటికీ.. మిగతా రెండు వన్డేల్లోమాత్రం పూర్తిగా తేలిపోయాడు. అతనికి ఎన్ని అవకాశాలు వచ్చినా రాహుల్ సద్వినియోగం చేసుకోలేకపోతుండటంతో జట్టు నుంచి తప్పించాలని చాలా మంది నెటిజన్లు డిమాండ్ చేశారు. అయితే రోహిత్ శర్మ గాయపడ్డ నేపథ్ంలో రాహుల్ ఏకంగా కెప్టెన్ అయ్యాడు.
మూడో వన్డేతోపాటు తొలి టెస్టుకు రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రాహుల్ జట్టులో ఉండటమే వేస్ట్ అని నెటిజన్లు అనుకుంటుంటే.. అదృష్టంతో ఏకంగా కెప్టెన్ అయ్యాడు. ఆయన కెప్టెన్సీలో బంగ్లాదేశ్‌తో మూడో వన్డే ఆడిన భారత్.. తొలి రెండు వన్డేల్లో ఓటములకు ప్రతీకారం తీర్చుకుంది. ఇషాన్ కిషన్ (210) డబుల్ సెంచరీ, విరాట్ కోహ్లి (113) శతకం బాదడంతో.. 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బంగ్లాతో తొలి టెస్ట్ ఆడుతుండగా, దానికి రాహుల్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
రాహుల్ కెప్టెన్సీలో అన్నీ అద్భుతాలు జరుగుతున్నాయి. అప్పటి వరకూ వన్డేల్లో సెంచరీ కూడా చేయని ఇషాన్ కిషన్.. బంగ్లాపై ఏకంగా డబుల్ సెంచరీ బాదాడు. శుభ్‌మన్ గిల్ టెస్టుల్లో తొలి శతకం చేశాడు. ఇక ఛతేశ్వర్ పుజారా దాదాపు నాలుగేళ్ల తర్వాత సెంచరీ చేయడం కూడా రాహుల్ కెప్టెన్సీలోనే జరిగాయి. ఇదంతా కాకతీళయమే అయినప్పటికీ.. రాహుల్ కెప్టెన్సీలో జరిగాయంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. వాళ్లుఅందరు రాహుల్ కెప్టెన్సీలోనే రాణించడం వల్ల జట్టు దూసుకుపోతుంది. రాహుల్ కెప్టెన్సీ వల్లే వాళ్లు అంత బాగా ఆడగలిగారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇది అదృష్టమో, లేదంటే ఆటగాళ్ల కసేమో తెలియదు కాని రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా దూసుకుపోతుంది.