Khushbu Sundar: ప్రముఖ నటి, బీజేపీ మహిళా నేత ఫైర్ బ్రాండ్ ఖుష్బు ఒకప్పుడు తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషలకు చెందిన ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ అభిమానులు ఖుష్బు కి ఏకంగా గుడి కట్టి పూజలు చేశారంటే ఆమె క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అయితే నటి ఖుష్బు తీవ్ర ఆస్వస్థతకు లోనుకావడంతో ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స జరుగుతుంది.
heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..
తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులు, నీరసరం తో ఖుష్బూ ఇబ్బంది పడటంతో వెంటనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరినట్లు ఖుష్బూ తెలిపారు. హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలను స్వయంగా షేర్ చేసిన ఖుష్బూ.. ‘ ఫ్లూ చాలా భయంకరమైనది.. ఇది నాపై చాలా ఎఫెక్ట్ చూపించింది.. నాకు ఫ్లూ రావడంతో తీవ్రంగా జ్వరం, ఒంటినొప్పులు, చాలా బలహీనంగా మారండతో తప్పక ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.. అడెనో వైరస్ ను ఏ ఒక్కరు తక్కువగా అంచనా వేయవొద్దు.. ఇది చాలా డేంజర్ వైరస్. ఎవరైనా అనారోగ్యానికి గురై ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలంటూ ఖుష్బూ పేర్కొంది.
View this post on Instagram