Homeandhra pradeshG.O. No.1 News : ఏపీలో జీవో నెం.1 పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

G.O. No.1 News : ఏపీలో జీవో నెం.1 పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Telugu Flash News

ఏపీలో రాజకీయంగా వివాదాస్పదమైన జీవో నెం.1 (G.O. No.1) పై సుప్రీంకోర్టు (Supreme court)  కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించకుండా ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 1పై విచారణను ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.

ప్రస్తుతం హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

అయితే ఈ కేసు 23న హైకోర్టులో మరోసారి విచారణకు రానున్నందున ఈ కేసును ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారించాలని సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది.

ఆ జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీవో 1 పై ఏపీ హైకోర్టు ఇటీవల స్టే విధించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

దీనిపై ఇవాళ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో పిటిషన్‌పై జోక్యం చేసుకోబోమని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్పష్టం చేసింది.

కేసు తదుపరి విచారణను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేపడతారని ధర్మాసనం వెల్లడించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ నెల 23న విచారణ చేపట్టాలని సీజేఐ సూచించారు.

-Advertisement-

టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరులో నిర్వహించిన సభల్లో తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో జీవో నంబర్ 1 తీసుకొచ్చిన ప్రభుత్వం, దీని ద్వారా రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించకుండా ఆంక్షలు విధించింది.

ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. రెండ్రోజుల క్రితం కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబును ఈ ఘటనతో సభలు, రోడ్ షోలకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు.

ఈ జీవోపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. బ్రిటిష్ చట్టాన్ని అమలు చేస్తారా అని ప్రశ్నించారు. మరోవైపు ఈ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న హైకోర్టులో విచారణ జరగనుంది.

also read: 

Common Point: డ‌బుల్ సెంచ‌రీ కొట్టిన ఈ బ్యాట్స్‌మెన్‌లో ఉన్న కామ‌న్ పాయింట్ ఏంటో తెలుసా?

cold remedies : ఆయుర్వేద చిట్కాలతో జలుబు, దగ్గుకు పరిష్కారం.. ఇలా ట్రై చేయండి!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News